రేవతి అలియాస్ ఆశా కేలుని నాయర్.మలయాళ ఆర్మీ కుటుంబంలో పుట్టింది రేవతి.
ఆమెకు చిన్నప్పటి నుంచే నాట్యం పైన ఆసక్తి ఉండటం తో ఐదేళ్ల వయసు నుంచి నాట్యం నేర్చుకుంది.ఏడేళ్ళకే అరంగేట్రం కూడా చేసిన రేవతి అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది.
ఇక స్కూల్ లో చేసిన రాంప్ వాక్ ఆమెకు హీరోయిన్ అయ్యే అవకాశాన్ని తెచ్చి పెట్టింది.గ్రూప్ లో ఉన్న కూడా రేవతి దర్శకుడు భారతి రాజాను బాగా ఆకర్షించింది.
ఆలా మన్ వాసనై అనే తమిళ సినిమా కోసం మొదట ఆమెను తీసుకున్నారు.అక్కడ మొదలైన రేవతి నట ప్రస్థానం నేటికీ కొనసాగుతూనే వుంది.
హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ 45 ఏళ్ళుగా ఆమె నటిస్తూనే వుంది.
తెలుగు లో మానస వీణ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రేవతి హిందీ లో కూడా కొన్ని సినిమల్లో నటించింది.
ఆమె సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో చాల పాపులర్ హీరోయిన్ గా కొనసాగింది.ఇక సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే తనతోటి నటుడు అయినా సురేష్ చంద్ర మీనన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత కూడా రేవతి హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించింది.పెళ్లి అయినా తొలినాళ్లలో సినిమాల కోసం పిల్లలను వద్దనుకున్నా రేవతికి అదే పెద్ద శాపం అయింది.
ఆ తర్వాత పిల్లల కోసం చాల ప్రయత్నం చేసిన కూడా ఆ దంపతులకు సంతానం కలగలేదు.
దాంతో సురేష్, రేవతి విడాకులు తీసుకొని విడిపోయారు.దాదాపు పదేళ్ల పాటు విడిగా ఉండి 2013 లో విడాకులు పొందారు ఈ జంట.అయితే రేవతి కి మాత్రం తల్లి కావాలనే ఆలోచన మనసులో అలాగే ఉండిపోయింది.అందుకే ఎవరు తీసుకొని ఒక పెద్ద స్టెప్ తీసుకుంది.ఆమె తల్లి కావాలంటే భర్త ఉండాల్సిన అవసరం లేదు.అందుకే స్పెర్మ్ డోనర్ సహాయం తో ఐ వి ఎఫ్ పద్దతిలో మహి అనే కూతురుకు 48 ఏళ్ళ వయసులో జన్మ ఇచ్చింది.ఇక ఇప్పటికి ఒంటరిగానే ఉంటూ తన కూతురుని పెంచుతుంది.
ఇటీవల కాలంలో తల్లి పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్న రేవతికి నిజ జీవితంలో తల్లవ్వాడమే పెద్ద అవార్డు అంటుంది.