జుట్టు విపరీతంగా రాలడం( Hair Fall ), చుండ్రు, తరచూ కురులు చిట్లిపోవడం, డ్రై గా మారడం, ముక్కలు అవ్వడం.ఇవన్నీ ప్రధానంగా వేధించే కేశ సమస్యలు.
అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే ఒక మిరాకిల్ రెమెడీ ఉంది.ఈ రెమెడీతో హెయిర్ ఫాల్ నుంచి డ్రై హెయిర్ వరకు అన్ని రకాల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ), రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసి ఉడికించాలి.దాదాపు పదిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత వాటర్ జెల్లీ స్ట్రక్చర్ లోకి మారుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జెల్ లో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి.
ఆ తర్వాత గ్రీన్ టీ బ్యాగ్( Green Tea bag ) ను తొలగించి.అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.కురులు సిల్కీగా షైనీ గా మారతాయి.డ్రై హెయిర్( Dry Hair ) అన్న మాటే అనరు.చుండ్రు సమస్య దూరం అవుతుంది.స్కాల్ప్ లోతుగా శుభ్రం అవుతుంది.జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి.
హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగడం ప్రారంభం అవుతుంది.
కురులు విరగడం చిట్లడం వంటివి సైతం తగ్గుతాయి.కాబట్టి హెల్తీ సిల్కీ మరియు థిక్ హెయిర్ ను కావాలనుకునేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.