ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని హీరోగా ఎదిగారు.అలాంటి తరుణంలోనే చాలామంది నటులు నాటక రంగం నుంచి ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు అలాంటి నటులలో కొంత మంది స్టార్ హీరోలు ఎదిగినప్పటికీ, మరికొంతమంది మీడియం రేంజ్ హీరోలుగా మిగిలిపోయారు, ఇంకొంతమంది అయితే ఇండస్ట్రీ లో అవకాశాలు రాక వదిలేసి వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు.
ఇండస్ట్రీలో బాలాజీ అనే వ్యక్తి ఉన్నాడు అని చాలా మందికి తెలియక పోవచ్చు ఎందుకంటే ఆయన చేసినది తక్కువ సినిమాలే.బాలాజీ రాజమండ్రి దగ్గర ఒక చిన్న గ్రామంలో జన్మించారు.
కానీ ఆయన చదువుకున్నది అంతా నెల్లూరులోనే ఆయన కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అయిన నాగబాబు తో పరిచయం ఏర్పడింది.అలాగే కాలేజీలో నాటకాలు వేస్తున్నప్పుడు బాలాజీ నాటకాల్లో పాల్గొని తన నటనతో అందరినిన మెప్పించి అవార్డు కూడా తీసుకునేవాడు.
అయితే నాగబాబు తో పరిచయం ఉండటం వల్ల చిరంజీవి సినిమాలు విడుదలైన ప్రతి సినిమా చూస్తూ ఉండేవాడు.నెల్లూరులో చిరంజీవి బిల్డింగ్ పక్కనే బాలాజీ ఇల్లు ఉండేది.
అయితే తను కాలేజీలో నాటకాలు వేసినప్పుడు చిరంజీవి చేతుల మీదుగానే అవార్డు తీసుకున్నాడు.
బాలాజీకి జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన నాలుగు స్తంభాలాట లో అవకాశం వచ్చింది దాంతో పెద్దగా గుర్తింపు రాకపోయినా దాసరి నారాయణ రావు గారు తీసిన ఓ ఆడది ఓ మగాడు సినిమాలో అవకాశం వచ్చింది దాంట్లో బాలాజీ చేసిన క్యారెక్టర్ కి మంచి గుర్తింపు రావడంతో మళ్లీ దాసరి నారాయణరావు దర్శకత్వంలోని కొన్ని సినిమాల్లో నటించాడు దాసరి గారికి విజయ బాపినీడు గారికి మధ్య ఉన్న అనుబంధం వల్ల విజయ బాపినీడు చిరంజీవి తో తీసిన మగమహారాజు సినిమాలో చిరంజీవి తమ్ముడి పాత్రలో బాలాజీ నటించాడు.
ఈ సినిమాలో చిరంజీవి తర్వాత అంత ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది బాలాజీ క్యారెక్టర్ అనే చెప్పాలి.చిరంజీవికి తమ్ముడిగా నెగటివ్ షేడ్స్ లో బాలాజీ చాలా బాగా నటించాడని చెప్పాలి.
అన్నయ్య చెప్తే వినకుండా మందు తాగుతూ కాలేజీ కి వెళ్ళకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే క్యారెక్టర్ లో బాలాజీ ఒదిగి పోయి నటించాడు.తర్వాత కొన్ని సినిమాలకి ప్రొడ్యూసర్ గా మారాడు.
ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో కొంచెం డీలా పడిపోయాడు దీంతో అమెరికాకు వెళ్లి ఒక మూడు సంవత్సరాలు విశ్రాంతి తీసుకున్నాడు తిరిగి వచ్చిన తర్వాత వెండితెరపై కాకుండా బుల్లితెరపై కొన్ని సీరియల్స్ చేశాడు ఎండమావులు, అంతరంగాలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే తను ప్రొడ్యూసర్ గా మారడం వలన సినిమాల్లో అవకాశాలు పెద్దగా రాలేదు.తను సూపర్ స్టార్ రజినీకాంత్ గారిని అచ్చుగుద్దినట్టు గా ఇమిటేట్ చేస్తాడు.బాలాజీని జూనియర్ రజనీకాంత్ అని కూడా పిలుస్తారు.బాలాజీ రజినీకాంత్ ని బాగా ఇమిటేట్ చేస్తాడు అని తెలుసుకున్న రజనీకాంత్ తన ముందు తనని ఇమిటేట్ చేయమని చెప్పాడు బాలాజీ ఇమిటేట్ చేసిన తర్వాత చాలా బాగా చేశావ్ అని కూడా మెచ్చుకున్నాడట రజినీకాంత్.అయితే బాహుబలి సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన రోహిణి బాలాజీ గారి చెల్లెలే.
రోహిణి నటుడు అయిన రఘువరన్ ని పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు ప్రస్తుతం రోహిణి సినిమాల్లో బిజీగా ఉన్నారు.