మనకు తెల్సినంత వరకు మనం ఏ పూజ చేసినా, ఎలాంటి వ్రతం చేసుకున్నా ముందుగా ఆ గణపతికే పూజ చేస్తుంటాం.ముందుగా విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడికే పూజ చేయాలని వేద పండితులు చెబుతాంటారు.
ఆ మాటలను వింటూ మనం కూడా మనం చేసే ప్రతీ పూజ, వ్రతానికి ముందు పసుపుతో గణపతిని తయారు చేసి… ప్రత్యేక పూజ చేస్తుంటాం.ఆ తర్వాతే మనం చేయాలనుకున్న పూజ చేస్కుంటాం.
అయితే పూజ అనంతరం ఆ పసుపు గణపతిని ఏం చేయాలో చాలా మందికి తెలియదు.ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్తుంటారు.
దేవుడి గదిలో పెట్టుకుంటే సరిపోతుందని కొందరు చెప్పగా.మరి కొందరు మొహానికి రాస్కోవాలని చెప్తుంటారు.
అయితే ఏది నిజం.పూజ చేసిన తర్వాత పసుపు గణపతిని ఏం చేయాలోమనం ఇప్పుడు తెలుసుకుందాం.
పూజ చేసిన తర్వాత పసుపు గణపతికి నమస్కారం చేస్కొని… పసుపు గణపతిని ఉంచిన తమలపాకు తూర్పు దిశగా కదిలించాలి.పూజ తర్వాత ఆ హరిద్ర గణపతిని ప్రసాదంగా భావిస్తూ… ఇంట్లోని దేవుడి గదిలో ఉంచుకోవాలి.
ఆ తర్వాత ఓ మంచి రోజు చూస్కొని పుణ్య స్త్రీలు ఆ పసుపు గణపతిని మొహానికి రాసుకోవాలి.లేదా మంగళ సూత్రాలకు పూసుకోవాలి.కాళ్లు, చేతులు, శరీరం, పాదాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాసుకోకూడదు.అందులోనూ ఎలాంటి మైల లేని రోజుల్లోనే ఆ పుసపు గణపతిని పూసుకోవాల్సి ఉంటింది.
కుదరదు అనుకున్న వారు ఇంట్లోని బావిలో లేదా పచ్చని చెట్ల వద్ద ఉంచి నీళ్లు పోయాల్సి ఉంటుంది.అలా అన్ని తొక్కుడు పడే చోట ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయొద్దు.
బావిలో నిమజ్జనం చేయడం కూడా చాలా మంచిది.