స్టార్ మా లో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది.ఇక ఇందులో నటించే నటీనటులు కూడా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.
అందులో ఎక్కువగా ఆకట్టుకున్న పాత్ర తులసి.ఈ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై మంచి పేరు సంపాదించుకుంది.
అంతే కాకుండా మంచి అభిమానం సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే తాజాగా తను ఓ విషయంలో బాగా ఎమోషనల్ అయింది.
తులసి అసలు పేరు కస్తూరీ శంకర్. ఈమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలలో వెండితెరపై హీరోయిన్ గానూ, సహాయ పాత్రల్లోనూ గాను నటించింది.
అంతేకాకుండా బుల్లితెరపై కూడా నటించింది.ఇక ఈమె అప్పట్లో మిస్ మద్రాస్ గా టైటిల్ కూడా సొంతం చేసుకుంది.
పలు షో లలో కూడా వ్యాఖ్యాతగా చేసింది.తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొని తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
ఎంత బిజీ లైఫ్ లో ఉన్న కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.అప్పుడప్పుడు ఆమె చేసే కౌంటర్ లు బాగా పెలుతూ ఉంటాయి.
రాజకీయ విషయాలలో కూడా బాగా పట్టుతో ఉంటుంది.ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో పలువురి రాజకీయ నాయకులను తన స్టైల్ లో విమర్శిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా పలువురు రాజకీయ నాయకులను చాలాసార్లు విమర్శించింది.

ఇక ఈమె షేర్ చేసుకునే ఫోటోలను చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేం.లేటు వయసులో కూడా తన అందాలను తెగ ఆరబోస్తుంది.ప్రస్తుతం ఆమె ప్రాజెక్టులలో కూడా బాగా బిజీగా ఉంది.
తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా వరస ప్రాజెక్టులతో అవకాశాలు అందుకుంటుంది.ఇక తెలుగు బుల్లితెరపై పలు షో లలో పాల్గొని బాగా సందడి చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ విషయంలో బాగా ఎమోషనల్ అయ్యింది కస్తూరి శంకర్. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.తాజాగా కస్తూరి ఇస్మార్ట్ జోడి షో లో పాల్గొని బాగా సందడి చేసింది.

అంతేకాకుండా కొన్ని విషయాలు పంచుకుంటూ.తన తండ్రి గురించి ఓ విషయాన్ని బయట పెట్టింది.తన తండ్రి గుర్తుకు వచ్చారంటూ.
చివరి క్షణాల్లో తండ్రి ఒకటి అడిగారని.ఆకలి వేస్తుంది రా అని అన్నాడని తెలిసింది.
ఆయనకు పార్కిన్ సన్ అనే వ్యాధి వచ్చిందని.దాని వల్ల మెదడు చెప్పే పనులను చేతులు, కాళ్లు వినవని తెలిపింది.ఆయనకు ఆకలి వేసినా కూడా తినడానికి చేతులు రావని.గొంతు కూడా కదలదని.
దాంతో ఆయన ఆకలిని చివరి వరకు కూడా తీర్చలేకపోయాం అంటూ కన్నీరు పెట్టుకుంది.దీంతో అక్కడున్న వారంతా కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.
ఇక ప్రస్తుతం ఆమె పలు ప్రాజెక్టుల లో బిజీగా ఉంది.







