కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.ఈ నెల 25 వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది ధర్మాసనం.
హైకోర్టు తీర్పును సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.ఈ క్రమంలో స్టే ఇచ్చిన ధర్మాసనం సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని వెల్లడించింది.
అదేవిధంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.మరోవైపు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు 25 వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.







