మన హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు మాసాలు కూడా ఎంతో పవిత్రమైన మాసాలుగా భావించి పెద్ద ఎత్తున ఆ నెలలో చేయాల్సిన వ్రతాలు పూజలు ఎంతో సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే నేడు డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది.
ఈ క్రమంలోనే ఈ నెలలో పెద్ద ఎత్తున విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి పూజ చేస్తూ అమ్మ వారి ఆశీస్సులు పొందుతారు.ఈ ధనుర్మాసం మొత్తం ప్రతి రోజు పూజలు, వ్రతాలు, జపాలు చేయడం మంచిదని శాస్త్రం చెబుతోంది.
ఎంతో పవిత్రమైన ఈ ధనుర్మాసంలో సూర్యుడు మకర సంక్రాంతి రోజు మకర రాశిలోకి ప్రవేశించే వరకు ధనుర్మాసం కొనసాగుతుంది కనుక ఈ రోజులన్ని పెద్ద ఎత్తున ఆలయాలలో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది.ఈ క్రమంలోనే ఈ ధనుర్మాసం మొత్తం భక్తులు సూర్యుడి ఆలయానికి విష్ణు ఆలయానికి సందర్శించి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.
ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రపరిచి దీపారాధన చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది.
ధనుర్మాసం అంటే దివ్యమైన ప్రార్థనలకు అనువైన నేల అని అర్థం.ఈ క్రమంలోనే ఈ ధనుర్మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తుంది.తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు.
స్వామి వారి సహస్రనామార్చనలో భాగంగా తులసీ దళాలకు బదులుగా బిల్వ దళాలను ఉపయోగించి అర్చన చేస్తారు.ఇలా ఈ నెల మొత్తం ఎంతో మంది భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారి పూజా కార్యక్రమాలలో పాల్గొంటూ పెద్ద ఎత్తున స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతుంటారు.
TELUGU BHAKTHI