తిట్టుకున్నా సెట్ అవుతున్నారు ! వైసీపీలో కీలక పరిణామాలు

వైసీపీలో ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

గెలుపు ఒక్కటే తన లక్ష్యం గా ముందుకెళ్తున్న జగన్ ఈ దశలో పార్టీని నమ్ముకుని, తన మీద అభిమానంతో పనిచేస్తున్న నాయకులకు కొంత అన్యాయమే చేస్తున్నట్టు కనిపిస్తోంది.

అయితే జగన్ మాత్రం ఇటువంటి విషయాలు గురించి ఆలోచిస్తే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందేమో అన్న ఆలోచనతో ఎక్కడికక్కడ సర్వేలు చేయించి గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయిస్తున్నాడు.నియోజకవర్గ ఇంచార్జిలను పెద్ద ఎత్తున మార్పు చేస్తూ కొత్త వారిని తెరమీదకు తెస్తున్నాడు.

ఈ మధ్య రెండూ మూడు నియోజకవర్గాల్లో జగన్ చేసిన మార్పు వైకాపాలో లొల్లిని పుట్టించాయి.వాటిల్లో చిలకలూరిపేట, విజయవాడ సెంట్రల్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలు ముఖ్యమైనవి.చిలకలూరి పేటలో మర్రి రాజశేఖర్ ను పట్టన పెట్టి రజనీని అభ్యర్థిగా తీసుకువచ్చాడు జగన్ మోహన్ రెడ్డి.

టీడీపీ నుంచి అభ్యర్థిని తీసుకురావడంతో వైసీపీలో లొల్లి పుట్టించింది.మర్రి రాజశేఖర్ బాగా అవమానానికి గురయ్యాడని ప్రచారం జరిగింది.ఆయన రాజీనామా అనే ఊహాగానాలు కూడా వచ్చాయి.

Advertisement

ప్రస్తుతానికి అయితే ఆయన కూల్ అయినట్టుగా అక్కడ అంత సర్దుమణిగినట్టుగా కనిపిస్తోంది.

ఇక రాజకీయంగా ఎంతో కీలకమైన విజయవాడ సెంట్రల్ సీటు విషయంలోనూ.వైసీపీ లో రగిలిన చిచ్చు అంత ఇంతా కాదు.విజయవాడ సెంట్రల్ సంగతి సరేసరి.

ఇక్కడ వంగవీటిని కాదని.మల్లాది విష్ణును అభ్యర్థిగా నియమించాడు జగన్ .దీంతో వంగవీటి వర్గం ఫైర్ అయ్యింది.వంగవీటిని విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అది ఆయనకు ఇష్టం లేదని ప్రచారం జరిగింది.దీంతో వంగవీటి వైసీపీకి రాజీనామా చేయబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

అయితే ఇప్పటి వరకూ అది జరగలేదు.ఇక గుంటూరు పశ్చిమ సీటు విషయంలో కూడా మార్పు చేశాడు జగన్.

Advertisement

ఇక్కడ తన స్నేహితుడు లేళ్ల అప్పిరెడ్డిని పక్కన పెట్టేసి ఏసురత్నాన్ని అభ్యర్థిగా బరిలోకి దించాడు.అయితే ఇలా మార్పు జరిగిన ప్రతి చోట ఏదో చిన్న అలజడి జరిగినట్టుగా కనిపించినా ఆ తరువాత సర్దుమణిగిపోవడం జగన్ కి కలిసొచ్చే అంశమే.

తాజా వార్తలు