బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఆ మధ్య వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు.కానీ ఈ మధ్య కాలం లో మాత్రం సంపూర్ణేష్ బాబు నుండి కొత్త సినిమాలు రావడం లేదు.
ఆయన హీరో గా మాత్రమే నటించాలని కోరుకుంటున్నాడట, కానీ హీరో గా ఎక్కువ అవకాశాలు రావడం లేదు.ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్ గా నటిస్తే ఎక్కువగా అవకాశాలు వస్తాయి కానీ సంపూర్ణేష్ బాబు ఆ దిశ గా అస్సలు ప్రయత్నాలు చేయడం లేదని తెలుస్తోంది.
వరుసగా మూడు నాలుగు సినిమా లతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న సంపూర్ణేష్ బాబు ఈ మధ్య కాలం లో పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడా అన్నట్లుగా కనిపించకుండా పోయాడు.

సోషల్ మీడియా లో బిజీ బిజీ గా కనిపిస్తూ ఉండే సంపూర్ణేష్ బాబు సినిమా లతో పాటు సోషల్ మీడియా కి కూడా దూరంగా ఉంటున్నాడని ప్రచారం జరుగుతుంది.మొత్తానికి సంపూర్ణేష్ బాబు గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న కారణంగా ఆయన కెరియర్ ఖతం అయినట్లే అనే అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి సోషల్ మీడియా లో సంపూర్ణేష్ బాబు గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.
ఇంతకు సంపూర్ణేష్ బాబు ఎందుకు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.ఎందుకు ఇతర హీరోల సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు అనేది ఆయన నోరు విప్పితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
సంపూర్నేష్ బాబు యొక్క కొన్ని సినిమా లు షూటింగ్ దశలో ఉన్నాయనే ప్రచారం జరిగింది.ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
కొత్త సినిమా లు అయితే కమిట్ అవ్వడం లేదు కానీ గతంలో ఉన్న సినిమా లు మాత్రం త్వరలో వస్తాయేమో చూడాలి.







