కన్నడ మూవీ యూటర్న్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రద్దా శ్రీనాథ్.ఈ అమ్మడు తెలుగు లో జెర్సీ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమా తోనే మంచి పేరు దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగు నుండి మంచి ఆఫర్లు దక్కించుకుంది.కాని ఈమె స్కిన్ షో కు వ్యతిరేకం అవ్వడంతో పాటు పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలే చేయాలనే పట్టుదలతో ఉండటం వల్ల టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు.
కొన్ని వెబ్ సిరీస్ ల్లో కూడా ఆఫర్లు వచ్చినా కూడా బోల్డ్ గా నటించేందుకు ఆసక్తి చూపించలేదు.దాంతో ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమాల సంఖ్య చాలా తక్కువే అని చెప్పాలి.
కన్నడంలో ఈమె మూడు నాలుగు సినిమాలు చేస్తోంది.తెలుగు లో ఈమె ను జనాలు మెల్ల మెల్లగా మర్చి పోతున్నారు.
ఈమె చివరి సారి కృష్ణ అండ్ హిజ్ లీలా అనే ఓటీటీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కనుక ఈమె ను మెల్ల మెల్లగా మర్చి పోతున్నారు.
ఇలాంటి సమయంలో ఆమె లుక్ కూడా మార్చింది.గతంలో కంటే మరింత సన్నబడ్డ ఈ అమ్మడు ఇప్పుడు మరింత స్టైలిష్ హెయిర్ స్టైల్ తో ఫొటోలు షేర్ చేసింది.
దాంతో ఈ అమ్మడిని గుర్తు పట్టడమే కష్టంగా మారింది.ఈ ఫొటోల్లో చూసిన వెంటనే ఈమె ఆమెనా అన్నట్లుగా ప్రేక్షకులు కొద్ది సమయం అలా చూస్తూనే ఉండి పోయారు అనడంలో సందేహం లేదు.

పెద్ద ఎత్తున ఈ అమ్మడు తెలుగు లో ఆఫర్లు దక్కించుకుంటుందని కెరీర్ ఆరంభంలో ఆశ పడ్డా తెలుగు లో సినిమాలకు తాను సెట్ అవ్వను అంటూ తనకు తాను నిర్ణయించుకుని కన్నడకు వలస వెళ్లింది.మళ్లీ తెలుగు లో ఈమె బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను దక్కించుకుంటుందేమో చూడాలి.