శ్రీముఖికి ముద్దులు ఇచ్చిన రణవీర్ సింగ్.. వీడియో పెట్టి మరీ మురిసిపోతున్న రాములమ్మ!

బుల్లితెరపై ఫిమేల్ యాంకర్ గ్లామర్ బ్యూటీ గా శ్రీముఖి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న ముద్దుగుమ్మ.తన మాటలతో, అల్లర్లతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని వారిని తన అభిమానులుగా మార్చుకుంది.

 Ranveer Singh Who Gave Kisses To Srimukhi Ramulamma Is Very Upset With The Video-TeluguStop.com

ఇప్పటికే ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఒక పేరు సంపాదించుకుంది.

వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

అక్కడ కూడా తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది.ప్రస్తుతం పలు షో లతో బాగా బిజీగా ఉంది.

ఇక ఈ ముద్దుగుమ్మ ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా ఇంట్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

ఈమె తొలిసారిగా అదుర్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఈ షోలో మంచి పేరు సంపాదించుకోవడంతో ఆ తర్వాత పటాస్ షోలో తన యాంకరింగ్ తో మరింత ఆకట్టుకుంది.అలా ఆ తర్వాత వరుసగా ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.

నిజానికి శ్రీముఖి ఎనర్జీ గురించి తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పాలి.

ఏ షోలో నైనా ఆమె చేసే అల్లరి బాగా సందడిగా ఉంటుంది.ఇక శ్రీముఖిని అందరు ముద్దుగా బుల్లితెర రాములమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు.ఇక శ్రీముఖి గతంలో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.

చివరి వరకు ఆటలో కొనసాగి రన్నరప్ గా నిలిచింది.ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

తన యాంకరింగ్ జీవితాన్ని కూడా యధావిధిగా కొనసాగిస్తుంది.ఇక రోజు రోజుకి శ్రీముఖి డిమాండ్ బాగా పెరిగిపోతుందనే చెప్పాలి.

ఇక సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ తో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.

అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్స్ లు చేస్తుంది.ఇక తన డాన్స్ వీడియో లను షేర్ చేస్తూ కుర్రాళ్లను మతి పోగొడుతుంది.అప్పుడప్పుడు ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో తన ఫాలోవర్స్ ను తెగ ఆకట్టుకుంటుంది.తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.

వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు చెబుతుంది.

ఇక ఫోటో షూట్ లంటూ తెగ హడావుడి చేస్తుంది.అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.ఈమధ్య పలు కొత్త షోలల్లో కూడా అడుగు పెట్టి బాగా సందడి చేస్తుంది.

ప్రస్తుతం తను వరుస షో లలో యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక వీడియో పంచుకుంది.

అందులో తను ఒక ఈవెంట్లో ఆలీతో పాటు యాంకరింగ్ చేస్తున్నట్లు కనిపించగా.అందులో తనకు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ హగ్ ఇచ్చి తన చేతులకు ముద్దులు పెట్టినట్లు కనిపించాడు.

దీంతో శ్రీముఖి ఆ మూమెంట్ ను సంతోషంగా ఫీల్ అయ్యి దానిని సోషల్ మీడియాలో పంచుకుంటూ బాగా మురిసిపోతుంది.ఇక ఈ వీడియోకు లైక్స్ తో పాటు కామెంట్లు కూడా బాగానే వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube