సాధారణంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లల బాగు కోసమే కష్టపడుతూ పరితపిస్తూ ఉంటారు.ఈ విధంగా వారికి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం తమ పిల్లల విషయంలో ఎంతో మనస్థాపానికి గురవుతూ ఉంటారు.
ఈ విధంగా పిల్లల విషయంలో ఎంతో మనస్థాపానికి గురవుతున్నటువంటి వారిలో ప్రస్తుతం అక్కినేని నాగార్జున( Nagarjuna ) కూడా ఉన్నారు.
నాగార్జున సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి నాగార్జున కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ సాధించారు.సినిమాలలో హీరోగా కొనసాగుతూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు.
అలాగే అన్నపూర్ణ స్టూడియో ద్వారా వందల కోట్ల లాభం అందుకుంటున్నారు.ఈ విధంగా నాగార్జున ఇండస్ట్రీలో కొనసాగుతూ వేల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించిన సంగతి తెలిసిందే.
నాగార్జున ఇండస్ట్రీలో సక్సెస్ అయినప్పటికీ నాగార్జున కొడుకుల మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోలేకపోయారు.నాగార్జున వారసులుగా అఖిల్( Akhil ) , నాగచైతన్య( Nagachaitanya ) ఇండస్ట్రీలోకి వచ్చారు.
నాగచైతన్య వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదురుకుంటున్నారు.ఈయన సమంతను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని ఒంటరి జీవితం గడుపుతున్నారు.

ఇక నాగచైతన్య పరవాలేదు అనిపించుకున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం ఇండస్ట్రీలో అందుకోలేకపోతున్నారు.అఖిల్ ఇప్పటివరకు ఐదు సినిమాలలో నటించారు కానీ ఏ ఒక్క సినిమా ద్వారా మాత్రం సక్సెస్ కాలేకపోయారు.ఇలా తన కుమారులు ఇద్దరి పరిస్థితి అయోమయంలో ఉండడంతో ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్నటువంటి నాగార్జున తన కొడుకుల సేఫ్టీ కోసం సరైన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది.ఇప్పటివరకు తన కొడుకుల టాలెంట్ పై ఎదగాలని ఎదురుచూసిన నాగార్జున ఇకపై అక్కినేని ట్యాగ్ ఉపయోగించబోతున్నారని తెలుస్తోంది.

ఇన్నాళ్లు అక్కినేని ట్యాగ్ ను ఉపయోగించుకోకూడదని చెప్పిన నాగార్జుననే… అక్కినేని ట్యాగ్ ని ఉపయోగిస్తూ బడా డైరెక్టర్స్ ను లైన్ లో పెడుతున్నారట.తన కొడుకుల ఇద్దరు జీవితాలు సెటిల్ అయితే తనకు కాస్త ప్రశాంతంగా ఉంటుందని భావించినటువంటి నాగార్జున స్వయంగా కొడుకుల కోసం రంగంలోకి దిగారని తెలుస్తుంది.ఆ కారణంగానే అఖిల్ కు బడా డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా అవకాశాల కోసం బాగా కష్టపడుతున్నారట.ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.ఎప్పుడు కూడా స్టేటస్ ని నమ్ముకొని నాగార్జున ఫస్ట్ టైం కొడుకుల కోసం తన స్టేటస్ ఉపయోగించుకుంటున్నారు.మరి ఇప్పుడైనా ఈ ఇద్దరు సక్సెస్ అవ్వాలని అభిమానుల కోరుకుంటున్నారు.