మారుతున్న టెక్నాలజీ చూస్తే ఒకవైపు ఆశ్చర్యం మరోవైపు ఆనందం కలుగుతుంది.అవసరాలకు తగినట్లు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది.
ప్రజల ఆశలకు అనుగుణంగా కొత్త వస్తులు జనం చెంతకు చేరుతున్నాయి.స్మార్ట్ లుక్ తో మార్కెట్ లో హంగామా చేస్తున్నాయి.
ఆకారం మారి అవసరాలు తీరుస్తూ కొత్త లుక్ , కొత్త ఫీచర్స్ తో తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి.అలాంటి స్మార్ట్ లుక్ తో అటు కళ్లకు ఇటు కాల్స్ చేసుకునేందుకు వీలుగా.
అవసరం అయినప్పుడు మ్యూజిక్ ను ఎంజాయ్ చేసేలా ఓ స్మార్ట్ గ్లాసెస్ అందుబాటులోకి వచ్చాయి. ఇండియా టెక్ కంపెనీ అంబ్రేన్ గ్లేర్స్ ఈ స్మార్ట్ గ్లాసెస్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ గ్లాసెస్ ప్రత్యేకత ఏంటంటే.చెవులకు సరిపడేలా ఉండి మైక్రో ఫోన్ అమర్చబడి ఉంటాయి.అంతే కాకుండా uv ప్రొటక్షన్ తో గుండ్రంగా చతురస్రాకారంలో ఉండే లెన్స్ కూడా ఉన్నాయి.టచ్ కంట్రోల్ ను ఉపయోగించి కాల్స్ మాట్లాడవచ్చు.ఇది ఓపెన్ ఇయర్ ఆడియో గ్లాసెస్ బ్లూటూత్ v5.1 ద్వారా లెన్స్ ను మార్చడానికి అనుమతించే టూ లెన్స్ ఆప్షన్ HD స్పీకర్ సిస్టం కలిగి ఉంది.ఇంకా మ్యూజిక్ ప్లే బ్యాక్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ లను కలిగి మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి వీలుగా తయారు చేయబడింది.ఇది అంబ్రేన్ గ్లేర్స్ ఆండ్రాయిడ్, ఐఒఎస్ డివైజ్ లకు కూడా సరోర్ట్ చేస్తుంది.UV400 సర్తిఫికేట్ ద్వారా UV కిరణాలు, రేడియేషన్ నుండి 99.99% ప్రొటక్షన్ కల్పిస్తుందని కంపెనీ పేర్కోంది.అంతేకాకుండా ఈ స్మార్ట్ గ్లాసెస్ వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది.కేవలం రెండు గంటల ఛార్జింగ్ తో 7 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కోంది.
అయితే దీని ధర భారత మార్కేట్ లో 9,999 కాగా.ప్రస్తుతం కంపెనీ వెబ్ సైట్ లో 4,999 కే కొనుగోలుకు అందుబాటులో ఉంచారు.







