యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది.టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించడంతో రామ్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సక్సెస్ ఈ సినిమాతో అందుకున్నాడు.
ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన నెక్ట్స్ మూవీని కూడా అప్పుడే రిలీజ్‌కు రెడీ చేశాడు.కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో రెడ్ అనే సినిమాతో మనముందుకు రావడానికి రామ్ రెడీ అయ్యాడు.
పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడు.
కాగా ఈ సినిమాను తొలుత ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
కానీ కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్‌డౌన్ వల్ల ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు.అయితే ఈ సినిమాను జూన్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
మరి ఈసారైనా అనుకున్న సమయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.