1.బీడిఎస్ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
బీడీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నీట్ అర్హత కటాఫ్ స్కోర్ తగ్గింది.
జనరల్ అభ్యర్ధులు 40 పర్సెంటైజ్ 113 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి కి 30 పర్సెంటైజ్ 87 మార్కులు దివ్యాంగులకు 35 పర్సెంటైజ్ 99 మార్కులను కటాఫ్ గా నిర్ణయించారు. కాళోజీ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నెల పదో తేదీ నుంచి 12వ తేదీ వరకు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ ప్రకటించింది.
2.షర్మిల ఇంటి వద్ద రెండో రోజు సందడి

వైయస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో నిన్న కీలక మీటింగ్ జరిగింది.రెండో రోజు ఆమె ఇంటి వద్ద వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులతో సందడి వాతావరణం నెలకొంది.
3.ఆయుష్ కన్వీనర్ కోటా రెండో విడత కౌన్సెలింగ్
యూజీ ఆయుష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి రెండో విడత వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను కాళోజీ ఆరోగ్య విద్యాలయం మంగళవారం విడుదల చేసింది.
4.పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే
మే 17 నుంచి 22 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
5.నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటన
నల్గొండ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు.
6.జగన్ కీలక సమావేశం

బడ్జెట్ కేటాయింపులు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు విషయంపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
7.కోయిలమ్మ సీరియల్ హీరో అరెస్ట్

కోయిలమ్మ సీరియల్ హీరో అమర్ ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.బోటిక్ వ్యవహారంలో స్నేహితుల మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో అమర్ వారిపై దాడి చేసిన వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు.
8.విజయ పాల సేకరణ ధర పెంపు
తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ది సహకార సమాఖ్య ( విజయ డైరీ) పాల సేకరణ ధరను లీటర్ కు రూపాయికి పెంచేందుకు నిర్ణయించినట్లు ఆ సంస్థ చైర్మన్ లోకా భూమా రెడ్డి తెలిపారు.
9.విశాఖలో ఎమ్మెల్యే నిరాహారదీక్ష
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను నిరసిస్తూ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నెట్టు ఉదయం నుంచి నిరాహార దీక్షకు దిగారు.
10.బ్రాహ్మణ కోడూరు లో రీ కౌంటింగ్

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు లో రీకౌంటింగ్ నిర్వహించారు.రీకౌంటింగ్ అనంతరం 11 ఓట్ల తేడాతో కొర్ణపాటి అశోక్ కుమార్ విజయం సాధించారు.
11.నాట్యం టీజర్ రిలీజ్.

ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్య రాజు ప్రధాన పాత్రలో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ నాట్యం ‘ సినిమా టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.
12.స్టీల్ ప్లాంట్ వద్ద నిరసన
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద సంస్థ ఉద్యోగులు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై నిరసన కార్యక్రమం నిర్వహించారు.
13.బిజెపి ఎంపీలకు విప్ జారీ
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ, మోడీ బడ్జెట్ పై ప్రసంగించనున్న నేపథ్యంలో, బీజేపీ ఎంపీలు అంతా సభలో ఉండాలంటూ ఎంపీలకు విప్ జారీ చేశారు.
14.భారత్ లో కరోనా
ఇచ్చిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 11,067 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
15.యూట్యూబ్ నుంచి ఆ పాటల తొలగింపు

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు విడుదల చేసిన రెండు పాటలను యూ ట్యూబ్ తొలగించింది.
16.రెహానా ఫాతిమా పై ఆంక్షల తొలగింపు
సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టకూడదు అని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఆలోచనలు పంచుకోకూడదు అని, కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్ట్ ఎత్తివేసింది.
17.బీహార్ క్యాబినెట్ లో 17 మందికి చోటు

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన క్యాబినెట్ ను విస్తరించారు.దీంట్లో మొత్తం 17 మందికి చోటు లభించించింది.
18.మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడొచ్చు
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
19.తెలంగాణలో కరోనా
గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44,750
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,810.