భారతీయ న్యాయవేత్తకు అరుదైన గౌరవం దక్కింది.సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అర్జున్ కుమార్ సిక్రీ సింగపూర్ అంతర్జాతీయ కమర్షియల్ కోర్టు న్యాయవాదిగా నియమితులయ్యారు.ఆగస్టు 1న సిక్రీ బాధ్యతలు స్వీకరించి.2021 జనవరి 4 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.

న్యాయశాస్త్రంలో విశేష అనుభవం సంపాదించిన జస్టిస్ సిక్రీ 2012, 2013 మధ్య కాలంలో పంజాబ్, హర్యానా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.అనంతరం 2013 నుంచి 2019 వరకు సిక్రీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు.

2019లో పదవి విరమణ చేసిన సిక్రీ.ప్రస్తుతం నేషనల్ జ్యూడీషియల్ అకాడమీలో సభ్యులుగా… ఇంటర్నేషనల్ లా అసోసియేషన్‌లో భారత విభాగానికి కార్యదర్శిగా ఉన్నారు.