సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఎప్పుడు ప్రేమలో పడతారో, ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో ఎవరికి తెలియదు.ప్రేమించుకుని పెళ్లిళ్లు( Love Marriages ) చేసుకున్న వారి జీవితం కొంతకాలం పాటు సంతోషంగా ఉంటున్నా తిరిగి విడాకులకు సిద్ధమవుతున్నారని చెప్పాలి.
ఈమధ్య కాలంలో విడాకుల పరంపరం అధికమవుతుంది.ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రెటీలు విడాకులు తీసుకొని విడిపోతున్న సంఘటనలను మనం చూస్తున్నాము.అయితే తాజాగా మరొక బాలీవుడ్ కపుల్స్ సైతం విడిపోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వరుణ్ ధావన్ (Varun Dhawan)ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నటాషా(Natasha) దలాల్ ను 2021 వ సంవత్సరంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరూ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు ఏ పార్టీ జరిగిన ఇద్దరు జంటగా కలిసి వెళ్లేవారు.ఈ విధంగా చూడముచ్చటగా ఉన్నటువంటి ఈ జంట విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు(Umair Sandhu) చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

తరచూ సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల గురించి సంచలనమైన ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే ఉమైర్ సందు తాజాగా వరుణ్ ధావన్ కపుల్స్ గురించి సోషల్ మీడియా వేదికగా సంచలనమైన ట్వీట్ చేస్తూ వీరిద్దరి మధ్య సఖ్యత లేదని, విడాకులు(Divorce) తీసుకొని విడిపోబోతున్నారు అంటూ ఈయన చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.ఇలా వరుణ్ ధావన్ జంట గురించి ఉమైర్ సందు ఇలాంటి ట్వీట్ చేయడంతో ఈ విషయం కాస్త బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చలకు కారణమైంది.అయితే ఈయన చేసినటువంటి ఈ ట్వీట్ లో ఏ మాత్రం నిజం లేదని ఇదంతా ఆ టెన్షన్ కోసమే ఆయన ఇలా చేశారు అంటూ కొట్టి పారేస్తున్నారు.