పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఇలా ఈయన నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాల పై శ్రద్ధ పెడుతున్నారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే చిత్రంలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించారు.
అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారనే విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభించనున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పోటీ పడటం కోసం మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి నటిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.

తాజాగా నటుడు పంకజ్ త్రిపాఠి ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.గత కొద్దిరోజుల నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలో నేను నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఆ వార్తలు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని అయితే అది నిజం కాదని… దురదృష్టవశాత్తు ఆ సినిమాలో నేను నటించడం లేదని ఈ సందర్భంగా పంకజ్ త్రిపాఠి తన గురించి వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చారు.ఇక హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా కలకత్తా బ్యాక్డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కనుంది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు.