అక్కినేని సినిమా పరిశ్రమలో ఉన్నం తకాలం పెద్దగా మీడియాతో మాట్లాడలేదు.కానీ మాట్లాడాల్సిన సమయం వస్తే మాత్రం ఖచ్చితంగా సమాధానాలు ఉండేవి.
అలాగే అవతలి వారిని ఎలాంటి కన్ఫ్యూజన్లో పడకుండా చూసుకునేవారు.ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ ( Open heart surgery )జరిగిన సమయంలో మీడియా ఆ విషయాలను ఎవరికి నచ్చిన విధంగా వారు రాస్తారు అని అందరిని పిలిచి కూర్చోబెట్టి షర్టు తీసి మరీ అతనికి జరిగిన సర్జరీ గురించి వివరించిన విధానం అప్పట్లో సంచలనం.
అంతెందుకు ఆయన క్యాన్సర్ సోకిన సమయంలో కూడా అతి త్వరలో నేను చనిపోబోతున్నాను.కానీ ఇదేమి పెద్ద విషయం కాదు.
అందరూ పుట్టినట్టే పుట్టాను అలాగే సమయం వచ్చినప్పుడు పోతాము.దీన్ని మామూలు వార్తగానే ఉంచండి.
వైరల్ చేయాలనే ఉద్దేశంతో మాత్రం చేయొద్దు అంటూ మీడియాకి చెప్పిన విధానం కూడా అప్పట్లో ఎవరూ మర్చిపోలేరు.

ఇక అక్కినేని పలు సందర్భాల్లో అనేక విషయాలను మీడియాతో పంచుకునేవారు.ఆ సందర్భంగా ఒకసారి నాగార్జునకు( Nagarjuna ) సంబంధించిన సినిమాల విషయంలో మీరు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ( Open Heart with RK )లో రాధా కృష్ణ ప్రశ్నించగా అందుకు అక్కినేని ఈ విధంగా సమాధానం చెప్పారు.సినిమా పరిమాణం చెందుతూ వస్తోంది.50 ఏళ్ల క్రితం ఉన్న సినిమా ఇప్పుడు లేదు.ఇప్పుడు ఉన్న సినిమా మరో 50 ఏళ్లకు ఉండదు.
అందుకని నాకు నచ్చిన విధంగా నాగార్జున సినిమాలు తీయలేడు.కానీ ఓసారి మాత్రం నాగార్జునకు సలహా ఇవ్వాలని చూసాను.
ఒక చిత్రం చూసిన తర్వాత ఇందులో నాలుగైదు చోట్ల వల్గర్ గా ఉంది ఎందుకు ఇలా చేశావు అని అడిగాను.

అందుకు నాగార్జున బదులుగా నాన్నగారు మీరు నా సినిమాలను చూసి మాత్రమే ఇలా చెప్తున్నారు.మీ సమయంలో మీరు చేసిన సినిమాలు కానీ, మీ తోటి హీరోలు చేసిన సినిమాలు కానీ ఎలాంటి వల్గారిటీ లేకుండానే ఉండేవి.అందరికీ అలా నడిచేది కూడా కానీ ఇప్పుడు నా తోటి హీరోలతో దీటుగా నేను సినిమాలు తీయాలంటే నాకన్నా ఎక్కువగా బయట హీరోల చిత్రాలు మీరు గమనించాల్సి ఉంటుంది.
వారు చేసిన దాంట్లో సగంలో సగం అయిన నేను చేయకపోతే ఈ పోటీ వాతావరణం లో ఉండలేను అంటూ బదులు ఇచ్చారట.