రవాణా ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష

పలు అంశాలపై చర్చ.సేవలను మరింత విస్తృతం చేయాలని ఆదేశం.

 Minister Puvwada Review With Transport Officials , Minister Puvwada Review , Tr-TeluguStop.com

రవాణా శాఖ మంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుష్ప గుచ్చా లతో అభినందనలు తెలిపిన అధికారులు.ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ సమావేశ మందిరంలో రవాణా శాఖ మరియు ఆర్టీసీ ఉన్నతాధికారులతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

సోమవారం ఉదయం అధికారులతో సమావేశమైన మంత్రి పువ్వాడ పలు శాఖాపరమైన అంశాలపై చర్చించారు.

రవాణా శాఖలో అందిస్తున్న పౌర సేవలు, ఆన్లైన్ సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సేవలను మరింత విస్తృతం చెయ్యాలని, మరి కొన్ని సేవలను ఆన్లైన్ ద్వారా అందించేందుకు సాధ్యమయ్యే అవకాశాలను పరిశీలించాలని అదేశించారు.ఆర్టీసీలో ప్రస్తుత బస్సులతో పాటు EV బస్సులు, దినసరి ఆదాయం తదితర అంశాలపై చర్చించారు.

రవాణా శాఖ మంత్రి గా మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు, ఇతర ఉన్నతాధికారులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube