తెలంగాణ బిజెపిలో( Telangana BJP ) ఇప్పుడు ఓ విషయం గందరగోళంగా మారింది.వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అసెంబ్లీ అభ్యర్థుల మొదటి జాబితా ఇదేనంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
ఈ జాబితాను బిజెపి అధికారకంగా ప్రకటించకపోయినా , సోషల్ మీడియాలో మాత్రం ఈ జాబితా హల్ చల్ చేస్తోంది .ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ జాబితా కలకలం సృష్టిస్తోంది.ఈ జాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురికి స్థానం దక్కింది .రాబోయే ఎన్నికల్లో తమ నియోజకవర్గం అని చెప్పుకుంటూ ప్రచారానికి దిగుతున్న నేతలకు ఈ జాబితా షాక్ ఇచ్చినట్లయ్యింది.ముఖ్యంగా వేములవాడ నుంచి మురళీధర్ రావు పేరు తెరపైకి రావడం , ఉమ్మడి జిల్లా నుంచి వివేక్ పేరు పోటీలో ఉండడం లేదనే విషయం పైన జోరుగా చర్చ జరుగుతుంది.
అలాగే హుజురాబాద్ నుంచి ఈటెల జమున( Etela Jamuna ) అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారనే హడావుడి మొదలైంది.
అంతేకాదు ఈ జాబితాలో కరీంనగర్ ఎంపీ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్( Bandi Sanjay ) కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని , మరో బిజెపి సీనియర్ నేత మురళీధర్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా ఈ లిస్టులో ఉంది .ఈటెల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని , హుజురాబాద్ బరిలో రాజేందర్ భార్య ఈటెల జమున పోటీ చేస్తారని, తొలి జాబితాలో పేరు ఉందనే ప్రచారం జరుగుతుంది.

అలాగే వివేక్( Vivek ) మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఆ లిస్టులో ఉంది .కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ లేదా వేములవాడ , కోరుట్ల నియోజకవర్గల్లో ఒకచోట పోటీ చేస్తారని ఇప్పటి వరకు ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నట్లుగా లిస్టులో ఉంది.బిజెపి సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు( Vikas Rao ) వచ్చే ఎన్నికల్లో వేములవాడ నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఆశిస్తున్నారు.అయితే ఈ నియోజకవర్గం నుంచి కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.

లిస్టులో వేములవాడ నుంచి మురళీధర్ రావు పేరు తెరపైకి వచ్చింది.అలాగే పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ ధర్మపురి నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల పై పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.అయితే వివేక్ చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని జాబితాలో పేరు రావడంతో పెద్దపల్లి జిల్లాలోని వివేక్ వర్గం నిరాశకు గురికాగా, కొప్పుల వర్గం మాత్రం రిలాక్స్ అవుతుంది.అయితే సోషల్ మీడియాలో వచ్చిన జాబితా అధికారికంగా విడుదలైంది కాదని ఒకవైపు బిజెపి వర్గాలు పేర్కొంటున్నా, ఈ లిస్టు మాత్రం తెలంగాణ బిజెపి నేతల్లో కాక పుట్టిస్తోంది.