గత ఏడాది కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రభావం చూపించిందో అందరికి తెలిసిందే.ఇక ఆ కరోనా భయానక రోజుల నుంచి ప్రజలు బయటపడి ఎవరి జీవితాలలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు.
ఇలాంటి సమయంలో మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ భారత్ పై సునామీలా విరుచుకుపడింది.ప్రతిరోజు లక్షలాది కేసులు నమోదు అవుతూ ఉండగా, వేలాది మంది చనిపోతారు.
కరోనాతో జీవితాంతం సహవాసం చేయాల్సిందే అని, అయితే దాని బారిన పడకుండా ఉండాలంటే భౌతిక దూరం, మాస్క్ తప్పనిసరి అని వైద్యులు తేల్చేశారు.భౌతిక దూరం లేకపోతే కరోనా చాలా వేగంగా దాడి చేస్తుందనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పేశారు.
భారత్ లో ఒక్కసారిగా ఇన్ని కేసులు పెరగడానికి కారణం కూడా భౌతిక దూరం పాటించకుండా, ఎన్నికల ర్యాలీలు, సినిమాలు, షాపింగ్ మాల్స్ లలో గుంపులు గుంపులుగా తిరగడమే అని అంటున్నారు.ఈ ఎఫెక్ట్ మొత్తానికి థియేటర్స్ లో సినిమాల రిలీజ్ మీద చాలా తీవ్ర ప్రభావం చూపించింది.
అలాగే భవిష్యత్తులో కరోనా, భౌతిక దూరం అనేది థియేటర్స్ లో సినిమాల రిలీజ్ పై విపరీతంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకొని థియేటర్స్ ఓపెన్ చేసి సినిమాలు రిలీజ్ చేసిన ప్రేక్షకులలో ఒకప్పటి ఉత్సాహం అయితే ఉండదని ట్రెండ్ పండితులు చెబుతున్నారు.
పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల వరకు అయితే కొంత పరవాలేదని, చిన్న సినిమాల రిలీజ్ కి మాత్రం గడ్డుకాలనే అని అంటున్నారు.ఇప్పటికే తెలుగులో వకీల్ సాబ్ హిట్ టాక్ తెచ్చుకున్న ఒక వారానికి మించి గట్టిగా ప్రభావం చూపించలేదు.
ఇక శ్రీకారం, వైల్డ్ డాగ్ తో పాటు రిలీజ్ అయిన కొన్ని చిన్న సినిమాల ఎవరేజ్, హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ ఎంత డిజాస్టర్ గా వచ్చాయో తెలిసిందే.ఇదే పరిస్థితి భవిష్యత్తులో కూడా చిన్న సినిమాలకి ఉంటుందనే మాట వినిపిస్తుంది.
ఈ నేపధ్యంలో పెద్ద సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయితే వారం, పది రోజులు వాటికి కలెక్షన్స్ వస్తాయి.తరువాత ఒటీటీ బాట పట్టాల్సిందే.ఇక చిన్న సినిమాలని థియేటర్స్ లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్ ఒటీటీలో చేసుకుంటే ఉత్తమం అనే మాట వినిపిస్తుంది.