సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు ఆవు పాలను లేదా గేదె పాలను అలవాటు చేస్తుంటారు.కొంతమంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు.
మరికొందరు ఆవు పాలు తాగిన అలర్జీ వస్తుంది.మరికొంత మంది పిల్లలకు ఆవు పాలు సరిగా జీర్ణం కావు.
ఇలా పాలు తాగిన వారికి కొంతమంది తల్లిదండ్రులు పాలలో హార్లిక్స్, బూస్ట్ లాంటివి కలిపి తాగిస్తారు.పిల్లలకు రైస్ మిల్క్ బెటర్ అని అంటున్నారు నిపుణులు దాని గురించి తెలుసుకుందాం.
చిన్న పిల్లలకు ఎటువంటి పాలు తాగించాలి అన్న విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు.అలాంటప్పుడు పిల్లలకు రైస్ మిల్ కు బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు నిపుణులు.
అవును రైస్ మిల్క్ లో లాక్టోస్ ఉండదు.అంతేకాకుండా ఈ రైతు మిల్క్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
రైస్ మిల్క్ ను బియ్యం తయారు చేస్తారు.
బియ్యాన్ని పిండిలా చేసి వాటితో పాలు తయారు చేస్తారు.రైస్ మిల్క్ రుచిలో తియ్యగా ఉంటాయి.కానీ వీటిలో లాక్టోస్ ఉండదు.
అలాగే ఇది కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది.పాలంటే ఎలర్జీ అనే పిల్లలకు ఇది సహాయపడుతుంది.
రైస్ మిల్లు లో కొలెస్ట్రాల్ లేనందున అలర్జీ తగ్గిస్తుంది.అలాగే ఇతర రకాల పాల కంటే తియ్యగా ఉంటాయి.
ఆవు పాల తర్వాత రైస్ మిల్క్ లో అత్యధిక చక్కెరలు, కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.అలర్జీ ఉన్న పిల్లలు బియ్యం పాలు అభ్యంతరం లేకుండా తాగవచ్చు.
అయితే బియ్యం పాలు తల్లి పాలకు ప్రత్యామ్నాయం కాదు.ఇది ఆవు పాలు లేదా బాదం పాలకు ప్రత్యామ్నాయం.
బియ్యం పాలలో ప్రొటీన్ ఎక్కువగా ఉండదు.ఇనుము కూడా ఉండదు.
కాబట్టి మధుమేహంతో బాధపడే పిల్లలకు ఇవ్వకూడదు.అలాగే మీ పిల్లలకు రైస్ మిల్క్ ఇచ్చేటప్పుడు ఒకసారి వైద్యుని సంప్రదించడం మంచిది.