ధన త్రయోదశి( Dhanatrayodashi ) పండుగ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పండుగ.ఈ ఏడాది ధన త్రయోదశి నవంబర్ 10వ తేదీన జరుపుకుంటున్నారు.
అయితే ధన త్రయోదశి పర్వదినం రోజు శని స్వరాశి అయిన కుంభరాశిలో ఉంటాడు.ఈ రోజు హస్త నక్షత్రం యాదృచ్ఛికంగా ఉందని, ఇది వ్యాపారవేత్తలకు అపారమైన ఆర్థిక ప్రయోజనాలను తెస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
అదే సమయంలో ఈ నక్షత్రంలో చేసిన కొనుగోల్లు శుభ ఫలితాలను ఇస్తాయి.ఈ రాశిలో బంగారం, వెండి కొనుగోలు చేయడం చాలా శుభ ప్రదమని నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజు కన్య రాశిలో శుక్రుడు, చంద్రుడు కలయిక వల్ల శుక్ర శశి యోగం ఏర్పడుతుంది.
ఈ అరుదైన కలయిక వల్ల ఈ రాశుల వారికి ఎంతో ప్రయోజనంగా ఉంది.మరి ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే దీపావళి( Diwali ) తర్వాత ధనస్సు రాశి వారికి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.
ఎప్పటినుంచో రావాల్సిన బకాయిలు తిరిగి చేతికి వస్తాయి.కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి.దీపావళి వృశ్చిక రాశి వారికి ఆదాయాన్ని పెంచే అవకాశం ఎక్కువగా ఉంది.
ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసే వారికి సమయం అనుకూలంగా ఉంది.కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
తోబుట్టువుల మద్దతు లభిస్తుంది.
ధన త్రయోదశి నుంచి సింహ రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది.ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తి అవుతాయి.ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు.ధన త్రయోదశి రోజు శుభ యోగం ఏర్పడడం వల్ల కర్కటక రాశి వారికి ఆకాస్మిక ధన లాభాలు వస్తాయి.
సొంత వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.ఈ సమయంలో ఏ పని చేసినా కచ్చితంగా విజయం సాధిస్తారు.
వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు.అలాగే మేషరాశి( Mesha Rasi ) వారికి ఈ శుభగ్రహ కలయిక మంచి ఫలితాలను ఇస్తుంది.
గృహ సౌఖ్యం పొందుతారు.కుటుంబంలో శాంతి సౌభాగ్య వాతావరణం ఉంటుంది.
ఆరోగ్యం చెక్కుచెదరకుండా ఉంటుంది.దాంపత్య జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.
వృత్తి వ్యాపారాల్లో తగిన గుర్తింపు తో పాటు అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంది.