ఒక సినిమా మనం చూస్తున్నాం అంటే దాంట్లో 24 విభాగాలకు సంభందించిన వాళ్ల శ్రమ ఉంటుంది.అయితే మనకు సినిమాల్లో కొన్ని పాటలు బాగా నచ్చుతాయి.
అందులో మ్యూజిక్ చేసిన వారికి ఆ పాట పాడిన వారికి చాలా క్రెడిట్ వెళ్తుంది అలాగే ఆ సాంగ్ రాసిన వాళ్ళకి కూడా మంచి క్రేజ్ వస్తుంది.నిజానికి మనం ఏ పని చేసిన పాటలు వింటూనే చేస్తాం ఒక లిరిక్ రైటర్( Lyric Writer ) రాసిన ఆ లిరిక్స్ కొన్ని సార్లు మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి మరి కొన్ని సార్లు మనలో ఉత్సాహాన్ని నింపుతాయి… అలాంటి రైటర్ లలో కులశేఖర్ గారు( Lyricist Kulasekhar ) ఒకరు…
డైరెక్టర్ తేజ( Director Teja ) గారు స్టార్టింగ్ లో తీసిన సినిమాల్లో చాలా సినిమాలకి ఆయనే లిరిక్ రైటర్ గా ఉండేవారు తేజ డైరెక్టర్ గా, ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా, కులశేఖర్ లిరిసిస్ట్ గా వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో చాలా హిట్ సినిమాలు వచ్చాయి.చిత్రం, నువ్వునేను, జయం, నిజం, ఔనన్నా కాదన్నా లాంటి మ్యూజికల్ హిట్ సినిమాలు వచ్చాయి.అయితే కొద్ది రోజుల తర్వాత కులశేఖర్ గారు ఇండస్ట్రీ లో అసలు ఎక్కడ కనిపించకుండా పోయారు
ఎందుకు ఆయన ఎటు వెళ్ళిపోయారు అని అందరూ అనుకున్నారు కానీ ఆయనకి కొంచం హెల్త్ బాగాలేక ఆయన సాంగ్స్ ఏమి రాయలేదు ఆయనకి బ్రెయిన్ లో ఇబ్బంది కలగడం వల్ల మెంటల్ అయి పోయి చాలా ఇబ్బందులు పడ్డారు.మొత్తానికి ఇపుడు ఆయన ఆరోగ్యం మొత్తం సెట్ అయింది ఇక దాంతో మళ్ళీ పాటలు రాస్తున్నట్టు గా తెలుస్తుంది…ప్రస్తుతం ఆయన కొన్ని చిన్న సినిమాల కి సాంగ్స్ రాస్తున్నట్టు గా తెలుస్తుంది.ఆయన పాటలకి ఇండస్ట్రీ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
అలాగే జనాల్లో కూడా ఆయనంటే ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు…
.