మనకు తెలిసినంత వరకు కరివేపాకులను కూరలల్లో తాలింపులుగా ఉపయోగిస్తుంటారు.కరివేపాకులో ఎన్నో ఔషధాలు నిండి ఉన్నాయి.
జట్టు రాలే సమస్యలు ఉన్నవారు రోజుకి నాలుగు కరివేపాకులు తిన్నా.సమస్య పరిష్కారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక కరివేపాకులో చాల ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. కరివేపాకులో యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హిపటో ప్రొటెక్టివ్ ఎక్కువగా ఉంటాయి.
ఇవి మన కాలేయానికి రక్షణ కల్పిస్తాయి.కరివేపాకు వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అవి ఏంటో చూద్దామా.
కరివేపాకు జుట్టు సమస్యలను నివారించేందకు ఉపయోగపడుతుంది.
జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది.అజీర్తి, ఎక్సెసివ్ యాసిడ్స్ ఉత్పత్తిని నివారిస్తుంది.కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది.ఆకులు రసం లేదా పేస్ట్ కాలిన, తెగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోపడతాయి.శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్ ను కరిగించి బరువు తగ్గిస్తుంది.ఇక ఆమ్లశ్రావం, జీర్ణ పూతలు, ఎముకల అరుగుదలకు, డయాబెటిస్, అతిసారం, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలను నియంత్రిస్తుంది.

అంతేకాదు కరివేపాకును చర్మ రక్షణ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు.కరివేపాకు ఆకులను రసంగా చేసుకొని లేదా ఆకులను ముద్దగా నూరి పేస్టులా తయారుచేసి, చర్మం ఎప్పుడైనా కాలినప్పుడు, గాయాలు తగిలినప్పుడు, దురదలు వంటివి ఏర్పడినప్పుడు వాటిపై ఆకుల పేస్టును కానీ, రసాన్ని గాని పట్టించడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు.ఇక కరివేపాకు ఆకులలో ముఖ్యంగా అనామ్లజనకాల తోపాటు అమైనో ఆమ్లాలు జుట్టు సంరక్షణలో మంచి ఆధారణ పొందింది.అయితే దానికోసంఏం చేయాలంటే.కరివేపాకులను కొబ్బరి నూనెలో వేసి మరిగించి, ఆ నూనెను వడగట్టి,జుట్టుకు పట్టించి,మర్దనా చేయడం, లేదా కరివేపాకులను పేస్టులా చేసి జుట్టుకు, తలకు పట్టించడం లాంటి పనులు చేయడం వల్ల, జుట్టు సమస్యలు అన్ని తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.