Rat Eating Cake: వైరల్: బిజినెస్‌ మీటింగ్‌లో కేక్‌ తింటూ ఎంజాయ్‌ చేస్తున్న పిలవని పేరంటం!

సోషల్ మీడియా ప్రభావం జనాల మీద ఎక్కువగానే వుంది.స్మార్ట్ ఫోన్ ఇపుడు శృతిమించి జనాల దగ్గరకు చేరింది.

 Rat Enjoys Eating Food In A Business Meeting Viral Video Details, Viral Latest,-TeluguStop.com

దాంతో నిత్యం అనేక రకాల వీడియోలు ఇక్కడ వైరల్‌ అవుతుంటాయి.ముఖ్యంగా వైరల్ అయినటువంటి వీడియోలను గమనిస్తే పులులు, సింహాలు, ఏనుగులు, పాములు, కుక్కలు, పిల్లుల గురించి అయి ఉంటాయి.

అయితే ఎలుకలకు సంబంధించినటువంటి వీడియోలు చాలా తక్కువగా మనకి కనబడుతూ ఉంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.

సాధారణంగా జంతువులు, పక్షులు చేసే అల్లరి గిలిగింత పెట్టేలా ఉంటుంది.ఇక నెటిజన్లు అయితే వాటిని చూసి మైమరిచిపోతూ వుంటారు.ఇక ఇక్కడ వైరల్‌ వీడియోని ఒకసారి పరిశీలిస్తే, ఈ వీడియోలో కొందరు ఉద్యోగులు ఏదో సీరియస్ మీటింగ్ లో వున్నారు.అందరూ సీరియస్‌గా ఏదో అంశంపై చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే కెమెరాను జూమ్ చేసినప్పుడు.వీరి సమావేశానికి అనుకోని అతిథి ఒకరు హాజరైనట్టుగా మనం గుర్తించవచ్చు.

ఇక అక్కడి అది ఓ దొంగతనం చేస్తోంది.మీటింగ్‌ మెయిన్‌ చైర్‌లో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి పుష్ప గుచ్చం ఉంది.

ఆ పక్కనే ప్లేట్‌లో ఒక కేక్‌ ముక్క వుంది.

ఆ పక్కనే నక్కి నక్కి దాగి వున్న ఎలుక మామ మీకు కనిపించిందా? ఎవరూ పిలవకుండానే పేరంటానికి వెళ్ళింది.వెళ్లడమే కాకుండా ఉద్యోగుల కోసం పెట్టిన కేక్ ముక్కను సైలెంట్ గా తినేస్తూ కనిపిస్తుంది.ఉద్యోగులంతా సీరియస్‌గా మాట్లాడుకుంటున్న సందర్భంలో పూల మాటున దాక్కున్న ఎలుక మాత్రం హ్యాపీగా కేక్‌ లాంగించేస్తూ అలా ఎంజాయ్‌ చేసే దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube