Sisters Love : ముద్దుల చెల్లెలిని సర్‌ప్రైజ్ చేసిన బాలిక... వైరల్ అవుతున్న వీడియో!

సోషల్ మీడియాలో నిత్యం అనేకరకాల వీడియోలు హల్ చల్ చేస్తూ ఉంటాయి.వాటిలో కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి, మరికొన్నిటిని చూస్తే ఆనందం కలుగుతుంది.

 The Girl Who Surprised Her Cute Little Sister The Video Is Going Viral , Sisters-TeluguStop.com

ఇంకొన్నిటిని చూస్తే చాలా ఫన్నీగాను….మరికొన్ని కాస్త ఎమోషనల్ గా అనిపిస్తాయి.

ఇక మానవ రక్తసంబంధాల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.మరీ ముఖ్యంగా అన్న – చెల్లెల్లు… అక్క – చెల్లెలు బంధాలు విడదీయలేనివి.

వారు వివిధ కారణాలవలన దూరంగా ఉన్నప్పటికీ అకేషనల్ గా కలుసుకున్నప్పుడు వారిమధ్య ఒకరకమైన అనుబంధం పెనవేసుకొని ఉంటుంది.

దాన్ని మాటల్లో వర్ణించలేము.

కలిసివున్నపుడు నిత్యం కీచులాడుకున్న వారే కొద్దిసేపు క‌న‌ప‌డ‌క‌పోతే విలవిలలాడిపోతూ వుంటారు.సరిగ్గా ఇక్కడ కూడా అలాంటి సంఘటనే జరిగింది.

ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి తిలకిస్తే 6 నెల‌ల త‌ర్వాత ఇంటికి వ‌చ్చిన యువ‌తి త‌న చిన్న చెల్లెలిని స‌ర్‌ప్రైజ్‌లో ముంచెత్తింది.దానికి సంబంధించినటువంటి వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వ‌ర్జినియా కా ఉల్ప్ అనే యూజ‌ర్ ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేయగా వెలుగు చూసింది.

ఈ వీడియోలో కనబడుతున్న బాలిక త‌న చిన్నారి చెల్లి రూంలోకి సడెన్ గా ఎంట‌ర‌వ‌డం క‌నిపిస్తుంది.ఆ గదిలో చ‌దువుకుంటున్న చెల్లెలు అక్క‌ను చూడ‌గానే షాక్ తింటుంది.ఆపై వెంట‌నే అక్క‌ను హ‌గ్ చేసుకుని చాలా సేపు అలాగే ఎమోషనల్ అయ్యి స్థాణువులా ఉండిపోయింది.

ఆరు నెల‌ల త‌ర్వాత ఇంటికొచ్చి లిటిల్ బేబీ సిస్ట‌ర్‌ను స‌ర్‌ప్రైజ్ చేశా.ఆమె ఎలా రియాక్ట్ అయిందో చూడండ‌ని వీడియోకు క్యాప్ష‌న్ ఇక్కడ ఇవ్వడం గమనించవచ్చు.ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ 2 ల‌క్ష‌లకు పైగా వీక్ష‌ణ‌లు రాగా, పెద్ద‌సంఖ్య‌లో నెటిజ‌న్లు స్పందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube