సాధారణంగా ఒక్కోసారి తలనొప్పి( headache ) చాలా విసుగుపుట్టిస్తుంటుంది.బిజీ లైఫ్ స్టైల్, ఆహారాపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం, కెఫిన్ ను అధికంగా తీసుకోవడం తదితర కారణాల వల్ల తలనొప్పి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది.
ఆ సమయంలో ఏ పని చేయలేకపోతుంటారు.ఏకాగ్రత పూర్తిగా దెబ్బ తింటుంది.
ఈ క్రమంలోనే ఏం చేయాలో తెలియక పెయిన్ కిల్లర్ వేసుకుంటూ ఉంటారు.కానీ సహజంగా కూడా తలనొప్పి నుంచి రిలీఫ్ పొందవచ్చు.
తలనొప్పిని పది నిమిషాల్లో తరిమికొట్టే ఉత్తమ ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా( Mint ).ఇది ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్ మాదిరి పని చేస్తుంది.ముఖ్యంగా తలనొప్పి ని తరిమి కొట్టడానికి చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.
ఐదారు ఫ్రెష్ పుదీనా ఆకులను మెత్తగా దంచి ఒక గ్లాసు పల్చటి మజ్జిగలో( buttermilk ) వేసి కలపాలి.చిటికెడు పింక్ సాల్ట్( Pink salt ) కూడా మిక్స్ చేసి సేవించాలి.
తల నొప్పిగా ఉన్నప్పుడు ఈ పుదీనా మజ్జిగను తీసుకుంటే వేగంగా రిలీఫ్ పొందుతారు.మైండ్ రిఫ్రెష్ అవుతుంది.
అలాగే అల్లం దాల్చిన చెక్క టీ కూడా తలనొప్పిని తరిమికొట్టడానికి సహాయపడుతుంది.టీ తయారీ కోసం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం తరుము, అంగుళం దాల్చిన చెక్క వేసి మరిగించాలి.
నీరు సగం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కలిపి తీసుకోవాలి.
తలనొప్పిగా ఉన్నప్పుడు అల్లం దాల్చిన చెక్క టీ తీసుకుంటే పది నిమిషాల్లో ఉపశమనం లభిస్తుంది.ఒత్తిడి, చిరాకు, ఆందోళన వంటివి సైతం పరార్ అవుతాయి.