టాలీవుడ్ హీరో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్.( Game Changer ) శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఈ సినిమాకు చాలా వరకు మౌత్ టాకు నెగిటివ్ గా వచ్చిన విషయం తెలిసిందే.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా విడుదల అయ్యి కనీసం వారం రోజులు కూడా కాకముందే ఒక లోకల్ ఛానల్లో ఈ సినిమాను ప్రసారం చేశారు.ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఒక నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
దీనిపై టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస కుమార్( Producer Srinivasa Kumar ) ఆగ్రహం వ్యక్తం చేశారు.సినిమా వెనక కొన్ని వేల మంది శ్రమ దాగి ఉంటుందని అన్నారు.అయితే ఈ మేరకు నిర్మాత శ్రీనివాస కుమార్ ఈ విషయంపై స్పందిస్తూ.ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.5 రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాన్ని లోకల్ ఛానళ్లలో, బస్సుల్లో ప్రసారం చేస్తున్నారు.ఈ విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలే కాదు.ఇది 4 సంవత్సరాల కృషి.
వేలాది మంది కలల ఫలితం.ఇలా లీక్ చేసే ముందు సినిమా విజయం పై ఆధారపడి జీవిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గురించి ఆలోచించండి.
ఇలాంటి పనులు చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు కూడా ముప్పు కలిగిస్తాయి.ఈ చర్యలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలి.దీనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది.సినిమాను కాపాడడానికి, భరోసానివ్వడానికి అందరం కలిసి పని చేద్దాం అని పోస్ట్ పెట్టారు.దీనికి #SaveTheCinema అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చాలా బాగుంది దీనికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.నిజంగా చాలా బాగా చెప్పారు ఇలాంటి వారిపై కఠినంగా తీసుకోవాలి అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
అయితే మొన్నటికి మొన్న ఒక బస్సులో ఈ విధంగానే గేమ్ చేంజర్ సినిమాను ప్రసారం చేసిన విషయం తెలిసిందే.అప్పుడు బస్సులో ఇప్పుడు ఈ విధంగా లోకల్ ఛానల్ లో ఈ సినిమాను ప్రసారం చేయడం పట్ల కొందరు మండిపడుతున్నారు.
అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.