మెగాస్టార్ బర్త్‌డేకు పవర్ స్టార్ ట్రీట్.. అదిరిపోలా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీఎంట్రీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను రీమేక్ చేస్తున్న పవన్ ‘వకీల్ సాబ్’గా మనముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

 Pawan Kalyan, Chiranjeevi, Vakeel Saab, Chiru Birthday-TeluguStop.com

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా తరువాత పవన్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పెట్టాలని చూస్తోంది.ఇక వకీల్ సాబ్ చిత్రాన్ని తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ సినిమాను ఏకంగా ఆగస్టులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.అయితే ఆగస్టులో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

మెగా ఫ్యాన్స్‌కు ఎంతో ఇష్టమైన రోజునే ఈ సినిమాను రిలీజ్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట.ఈ క్రమంలోనే వారు సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మొత్తానికి మెగాస్టార్ పుట్టిన రోజుకు పవర్ స్టా్ర్ ట్రీట్ అంటూ అది మామూలు రచ్చ కాదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.మరి ఈ సినిమాను ఆగస్టులోనే రిలీజ్ చేస్తారా లేక ముందే చేస్తారా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube