ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ప్రకటించిన పాన్ ఇండియన్ సినిమాల్లో ”వార్ 2( War 2 ) ఒకటి.ఈ ప్రాజెక్ట్ సంచలనం అనే చెప్పాలి.
ఈ సినిమాపై మన తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎందుకో అందరికి తెలుసు.
ఈ సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది.దీంతో తారక్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.
తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు.
ఎన్టీఆర్ అండ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ( Hrithik Roshan )కాంబోలో ”వార్ 2” ప్రకటించారు.
ఊహించని ఈ కాంబో ప్రకటించడమే సెన్సేషనల్ అయ్యింది.ఈ కాంబో ప్రకటించినప్పటి నుండి ఒక రేంజ్ లో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.అంతేకాదు అప్పటి నుండి ఈ సినిమా విషయంలో ఏదొక రూమర్ వైరల్ అవుతూనే ఉంది.ఇక తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇందులో ఈ ఇద్దరు స్టార్ హీరోలు మాత్రమే కాకుండా మరో స్టార్ హీరో కూడా ఉన్నాడట.మొత్తం ముగ్గురు స్టార్ హీరోలు నటించ బోతున్నట్టు తాజాగా టాక్ వినిపిస్తుంది.మరి మరో స్టార్ హీరో ఎవరంటే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య( Suriya )పేరు వినిపిస్తుంది.ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి ఉండాలి.
ఒక వేళ ఇదే నిజమైతే ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ హీరోలను తీసుకున్న మేకర్స్ ఇప్పుడు కోలీవుడ్ హీరో కూడా ఉన్నాడని టాక్ రావడంతో ఈ సినిమా యావత్ దేశాన్ని కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇక వార్ ఇద్దరు స్నేహితుల కథ అని అర్జునుడు, కృష్ణుడు లా కలిసి ఉన్న స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు? మారితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి ? అనే కోణంలో ఈ కథ సాగనుంది.

ఇది యాక్షన్ ఫిలిం కాబట్టి ఎన్టీఆర్ నుండి మరింత ఎక్కువ ఆశిస్తున్నారు ఫ్యాన్స్.ఏది ఏమైనా హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ వైటింగ్ చేస్తున్నారు.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ను యష్ రాజ్ ఫిలిమ్స్ పై ఆదిత్య చోప్రా నిర్మించ బోతున్నారు.







