పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నెమ్మదించింది.సినిమాకి టాక్ బాగాలేకపోయినా, మొదటిరోజు రికార్డు కలెక్షన్లు రావడం సినిమాకి బాగా ఉపయోగపడింది.మొదటిరోజే 29 కోట్లు కొల్లగొట్టిన సర్దార్, తరువాతి తొమ్మిది రోజుల్లో మరో 21 కోట్లు సంపాదించింది.50 కోట్ల క్లబ్ లో ఇది పవన్ కి మూడోవ సినిమా.ఇంతకుముందు గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలు 50 కోట్ల షేర్ మార్కుని దాటాయి.







