నటి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)నటించిన ఫర్హానా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె పుష్ప(Pushpa) సినిమాలోని రష్మిక (Rashmika) పాత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమెకు తెలుగులో ఎలాంటి పాత్రలు చేయాలని ఉందని ప్రశ్నించినప్పుడు రష్మిక నటించిన శ్రీవల్లి(Srivalli) పాత్రలో నటించాలని ఉంది అంటూ తెలిపారు.అయితే దీనిని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేశారు.దీంతో రష్మిక అభిమానులు తీవ్ర స్థాయిలో ఐశ్వర్య రాజేష్ పై మండిపడుతున్నారు.దీంతో ఈ వార్తలపై స్పందించిన ఐశ్వర్య రాజేష్ వివరణ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇటీవల తెలుగులో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారని తనను ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న వేయడంతో తాను పుష్ప సినిమాలో రష్మిక నటించిన శ్రీవల్లి పాత్ర నాకు బాగా సెట్ అవుతుందని అలాంటి పాత్రలో నటించాలని ఉంది అంటూ తాను తన అభిప్రాయాన్ని తెలియజేశానని ఐశ్వర్య రాజేష్ వెల్లడించారు.అయితే నా మాటలను తప్పుగా అర్థం చేసుకొని నేను రష్మికను కించపరిచేలా మాట్లాడినట్టు రూమర్స్ క్రియేట్ చేశారు.ఆ పాత్రకు రష్మిక కన్నా తానే బాగా సెట్ అవుతానని చెప్పినట్టు రూమర్స్ క్రియేట్ చేశారు.

తాను రష్మిక గురించి తన నటన గురించి తప్పుగా మాట్లాడలేని తాను రష్మికతో పాటు ఇతర నటీనటులందరిపై నాకు ప్రగాఢమైన అభిమానం ఉంటుంది.దయచేసి ఇలాంటి అసత్యపు వార్తలను ప్రచారం చేయకండి అంటూ ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ రష్మిక నటించిన శ్రీవల్లి పాత్ర విషయంలో క్లారిటీ ఇస్తూ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.పుష్ప సినిమాకు సీక్వల్ చిత్రంగా తెరకేక్కుతున్న పుష్ప2 (Pushpa 2) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.







