సచివాలయం ఉద్యోగుల రెగ్యులరైజేషన పై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోకి సచివాలయ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు.యు.
కొత్తపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు థాంక్యూ సీఎం అనే కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ ఎంపీడీవో రామారావు అధ్యక్షతన జరిగింది.సచివాలయ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ చేసినందుకుగాను వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరై కేక్ కట్ చేసి, సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేశారు.అనంతరం సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ,సచివాలయం ఉద్యోగుల బాధను అర్థం చేసుకొని ఉద్యోగాలు రెగ్యులరైజేషన్ చేసినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలే కాకుండా మరెన్నో కార్యక్రమాలు నెరవేర్చారన్నారు.సచివాలయ ఉద్యోగుల అంకితభావంతో పనిచేసి సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరింత పేరు ప్రత్యేకతలు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు.
ఈకార్యక్రమంలో అమలాపురం ఏపీడీ పివసంత మాధవి,ఎంపీపీ కారే సుధ శ్రీనివాసరావు,మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్,రాష్ట్ర వైసిపి నాయకుడు రావు చిన్నారావు,వైస్ ఎంపీపీ చెట్టు బత్తిన సురేష్ కుమార్ నాని,జడ్పీటీసీ తులసి కుమార్,కొత్తపల్లి పీఏసీఎస్ అధ్యక్షుడు మారిశెట్టి బుజ్జి, సర్పంచులు గవర భవానీ నాగేశ్వరరావు,బండి రాణి దావీదు, కర్రీ చిన్నారావు,పాలాని దొరబాబు, రావి రమేష్,నక్క మణికంఠ బాబు,రొంగలి వీరబాబు, కంబాల మౌనిక లక్ష్మణ్,ఎంపీటీసీలు దాకే నాగమల్లేశ్వరి రాజ్ కుమార్, రాయుడు విష్ణు,సచివాలయం సిబ్బంది భారీ ఎత్తున పాల్గొన్నారు.