వైసీపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఆత్మకూరు ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది.
గౌతంరెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డిని వైసీపీ నాయకత్వం అభ్యర్థిగా ఈ ఉప ఎన్నికలలో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.దాదాపు లక్ష మెజార్టీ ని టార్గెట్ గా పెట్టుకొని ఉప ఎన్నికలలో గెలవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది.
ఇటువంటి తరుణంలో ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ పై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కు ఫిర్యాదు చేశారు.
విషయంలోకి వెళితే ఆత్మకూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసే రీతిలో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను ఉపయోగిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.
గ్రామ, వార్డు సచివాలయం వ్యవస్థల ద్వారా వైసిపి డబ్బులను పంచుతున్నట్లు.సోము వీర్రాజు ఈసీకి ఫిర్యాదు చేశారు.డబ్బులను పంచుతున్న వాలంటీర్లను అడ్డుకుంటున్న బిజెపి శ్రేణులపై వైసీపీ దాడులకు పాల్పడుతున్నట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో ఉప ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరగాలంటే బీజేపీ కార్యకర్తలకు మరియు ఏజెంట్లకు భద్రత కల్పించాలని ఎన్నికల ప్రధాన అధికారినీ సోము వీర్రాజు కోరడం జరిగింది.
ఈ నెల 23వ తారీకు ఆత్మకూరు ఉపఎన్నిక జరగనుంది.







