సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు మనల్ని భలే ఆకట్టుకుంటాయి.మరీ ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయి.
తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో విస్తృతంగా వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక పిగ్ షెల్టర్ చూడొచ్చు.
ఈ షెల్టర్ లో ఒక పెద్ద పంది కూడా ఉంది.అయితే ఈ షెల్టర్ వద్దకు ఒక భారీ ఎలుగుబంటి వచ్చింది.
ఆ తర్వాత అది షెల్టర్ లోపలికి దూకేందుకు ప్రయత్నించగా.ఆ పంది దానిని బాగా భయపెట్టింది.
అయినా ఎలుగుబంటి ధైర్యం చేసి లోపలికి దూకింది.అంతే క్షణాల్లోనే పంది ఎలుగుబంటి పై విరుచుకుపడింది.
నిజానికి ఎలుగుబంటి తలుచుకుంటే పంది మెడని కొరికి దాన్ని చంపగలదు.కానీ ఇక్కడ మాత్రం పంది ధైర్యానికి బెదిరిపోయింది ఎలుగుబంటి.
ఇంతలో మరొక పంది కూడా దాడి చేయడానికి శరవేగంగా దూసుకొచ్చింది.దీంతో స్టన్ అయిపోయిన ఎలుగుబంటి అక్కడి నుంచి చల్లగా జారుకుంది.
దీనికి సంబంధించిన వీడియోని లాడ్ బైబిల్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.ఇప్పుడు అది విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోకి ఇప్పటికే రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి.అలాగే వేలల్లో కామెంట్లు వచ్చాయి.
ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ధైర్యంతో ఎలుగు బంటిని ఎదిరించిన పందులను కొందరు మెచ్చుకుంటున్నారు.
డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ప్లేయర్లలా ఈ పందులు తమ షెల్టర్ లోకి వచ్చిన ఎలుగుబంటిని భలే తరిమికొట్టాయంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. వామ్మో, ఈ పందులు మామూలివి కావు బీయర్ కి పట్టపగలే చుక్కలు చూపించాయని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.







