పూనమ్ కౌర్ కు తెలుగుదేశం పార్టీకి ఉన్న లింక్ ఇదే.. 40 ఏళ్ల క్రితమే అలా జరగడంతో?

టాలీవుడ్ ప్రేక్షకులకు పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ మధ్య కాలంలో సినిమాల కంటే వ్యక్తిగత విషయాల ద్వారా, వివాదాల ద్వారా పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచారు.

 Link Between Poonam Kaur And Telugudesham Party Details Here Goes Viral, 40 Yea-TeluguStop.com

పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు సంబంధించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.అయితే పూనమ్ కౌర్ తాజాగా తన పోస్ట్ ద్వారా తనకు తెలుగుదేశం పార్టీకి ఉన్న లింక్ గురించి వెల్లడించారు.

నిన్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కాగా ఏపీలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.పూనమ్ కౌర్ తన ఫేస్ బుక్ ఖాతాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాను సీనియర్ ఎన్టీఆర్ గారిని తలచుకోవాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.మా నాన్న కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుడు అని సీనియర్ ఎన్టీఆర్ కు ఫాలోవర్ అని పూనమ్ కౌర్ పేర్కొన్నారు.40 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ తో పాటు తన తండ్రి దిగిన ఫోటోను పూనమ్ అభిమానులతో పంచుకున్నారు.

తనకు ఈరోజు ఫోటో కనిపించిందని సీనియర్ ఎన్టీఆర్ పై తనకు అమితమైన గౌరవం ఉందని పూనమ్ కౌర్ అన్నారు.లవ్యూ పప్పా అంటూ పూనమ్ కౌర్ తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు.పూనమ్ కౌర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఈ పోస్ట్ కు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.“ఆ పార్టీతో మనకు వద్దు వదిన” అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు చేశారు.

పూనమ్ కౌర్ చేసిన ఈ పోస్ట్ కు 800కు పైగా లైక్స్ వచ్చాయి.పూనమ్ కౌర్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో మాత్రం పూనమ్ కౌర్ యాక్టివ్ గా ఉండటంతో పాటు తన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube