ఉన్నత అవకాశాల కోసం, మెరుగైన జీవితం కోసం ఎన్నో ఆశలతో కెనడాలో( Canada ) అడుగుపెట్టిన ఓ భారతీయ యువకుడు అక్కడికి వెళ్లిన నాలుగు రోజులకే శవమై తేలాడు.దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అతని స్వగ్రామం పంజాబ్‌లోని( Punjab ) అడంపూర్ సమీపంలోని నౌలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.గగన్‌దీప్ అలియాస్ గుగ్గు.
కెనడాలో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు అతని కుటుంబానికి సమాచారం అందింది.గగన్‌దీప్‌కు ఇప్పటికే వివాహం కాగా.
అతని భార్య కూడా స్టూడెంట్ వీసాపై కెనడాకు వెళ్లింది.
తన కొడుకు, కోడలిని కెనడాకు పంపించేందుకు రూ.30 లక్షలు అప్పు చేశానని బాధితుడి తండ్రి మోహన్ లాల్ కన్నీటి పర్యంతమయ్యారు.ఇప్పుడు గగన్ మృతదేహాన్ని( Gagandeep ) స్వదేశానికి తీసుకురావడానికి 20,000 కెనడియన్ డాలర్లు వెచ్చించే స్థోమత తనకు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గగన్‌దీప్ తల్లి సీమా మాట్లాడుతూ.తన కుమారుడు సెప్టెంబర్ 6న అమృత్‌సర్ నుంచి టొరంటోకి( Toronto ) బయల్దేరాడని తెలిపారు.

సెప్టెంబర్ 10న రాత్రి 9.30కి వీడియో కాల్ చేశాడని.ఇంకా ఇక్కడ తెల్లవారుజాముగానే వుందని, ఇప్పుడే భోజనం చేశానని చెప్పినట్లు సీమా తెలిపారు.అయితే నిన్న తెల్లవారుజామున 2.30 గంటలకు గగన్‌దీప్ మరణించినట్లుగా ఫోన్ వచ్చిందని, దీంతో తామంతా షాక్‌కి గురయ్యామని సీమా( Seema ) కన్నీటి పర్యంతమయ్యారు.నవంబర్ 2021లో గగన్‌దీప్ పెళ్లి చేసుకున్నాడని.
ఆ మరుసటి నెలలోనే తమ కోడలు కెనడాకు వెళ్లిందని ఆమె చెప్పింది.అక్కడ ఒక సెమిస్టర్ పూర్తి చేసి పంజాబ్‌కు వచ్చిందని సీమా వెల్లడించారు.

అయితే గగన్‌దీప్ మరణం పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎంతో ఆరోగ్యంగా వుండే తమ బిడ్డ ఇంత త్వరగా ఎలా మరణిస్తాడని ప్రశ్నిస్తున్నారు.అతని పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.ఇప్పటికే తమ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.గగన్‌దీప్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు సాయం చేయాలని వారు కోరుతున్నారు.మరోవైపు.
కెనడాలోని పంజాబీ కమ్యూనిటీ గగన్ మృతదేహాన్ని స్వదేశం చేర్చడానికి నిధుల సేకరణ చేపట్టింది.