మెదక్ పై రాములమ్మ చూపు ?

టిఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత, విజయశాంతికి ఆ పార్టీలోనూ, ప్రభుత్వం లోనూ మంచి ప్రాధాన్యం దక్కింది.కెసిఆర్ కూడా తన సొంత చెల్లెలు అంటూ విజయశాంతిని పొగడమే కాకుండా,  ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకు వెళ్ళేవారు.

 Vijayasanthi  Poltical Focus On O Medak Medak Mp, Ramulamma, Vijayasanthi, Trs,-TeluguStop.com

తరువాత కొన్ని కొన్ని కారణాలతో విజయశాంతిని దూరం పెడుతూ రావడం, పట్టించుకోనట్టుగా వ్యవహరించడం తదితర కారణాలతో విజయశాంతి టిఆర్ఎస్ కు రాజీనామా చేశారు.ఆ తరువాత చాలా కాలం పాటు సైలెంట్ గానే ఉన్నారు.

అదే సమయంలో బిజెపి నుంచి ఆహ్వానం అందడంతో గతంలో ఆమె బిజెపిలో కీలకంగా వ్యవహరించిన నేపథ్యం ఉండడం తదితర కారణాలతో వెంటనే బిజెపి కండువా కప్పుకుని పార్టీలో యాక్టివ్ గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
       బిజెపి అధిష్టానం పెద్దల వద్ద ఆమె మంచి పలుకుబడిని సంపాదించుకున్నారు.

రాబోయే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా సంకేతాలు పంపిస్తున్నారు.ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ప్రధాన సమస్యలపై స్పందిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.

టిఆర్ఎస్ నుంచి మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో, ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందాలని చూస్తున్నారు.తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల సమస్యలపై ఆమె స్పందించడంతో మెదక్ నియోజకవర్గం పైన ఆశలు పెట్టుకున్నారనే విషయం హైలెట్ అవుతోంది.
   

Telugu Bandi Sanjay, Medak Mp, Ramulamma, Trs, Vijayasanthi-Politics

  ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయశాంతి సందర్భాన్ని బట్టి తెలంగాణలో నెలకొన్న ప్రధాన సమస్యలపై  స్పందిస్తూ ఉంటారు.నిన్న

సోషల్ మీడియాలో

ఆమె స్పందించిన తీరు ఈ అనుమానాలకు బలం చేకూర్చుతుంది. సోషల్ మీడియా ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సమస్యలపై స్పందించారు.రాష్ట్రానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెడుతున్న కేసీఆర్ సర్కార్ కు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులు పూర్తిగా నష్టపోయారని, వారందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత టిఆర్ఎస్ ప్రభుత్వం పైనే ఉందని విజయశాంతి అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు 7 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు అవుతోందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారని, ఇందులో సంగారెడ్డి జిల్లాలో పూర్తిస్థాయిలో పత్తి సాగు చేయగా , సిద్దిపేట మెదక్ జిల్లాలో 50 శాతం మేరకు పత్తి సాగయిందన్నారు.

గత నెలలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా సాగుచేసిన పంటలు పాడయ్యాయని, మరోసారి వర్ష సూచన ఉండడంతో బాధిత రైతులు పంటలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయని ఇ ప్పటికైనా టిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి బాధిత రైతులను ఆదుకోవాలని ఆమె కోరారు.   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube