సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఎన్నో కష్టాలు పడాలి అది నాటి రోజుల్లో అయినా నేటి రోజుల్లో అయినా ఒకే విధంగా ఉంది.ఎంతో కష్టపడి సినిమాల్లో నటిస్తేనే పూట గడిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
ప్రస్తుతం నేడు ఎంతో ఆడంబరాలు, ఎంతో లగ్జరీగా బ్రతుకుతున్న వాళ్ళు నాటి రోజుల్లో పడరాని కష్టాలు పడ్డవాళ్లే.అలాంటి నటులలో చలపతిరావు గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి.
ఆయన కష్టాలు పడుతున్న సమయంలో అలాగే ఆయన ఎదుగుదల లో ఆయన భార్య ఇందుమతి ఎల్లప్పుడూ తోడుగా ఉంది.
తన భార్య లేనిదే తన జీవితం లేదంటాడు చలపతిరావు.
కనీసం స్టూడియోకి వెళ్లడానికి బస్సు ఎక్కడానికి 20 పైసలు కూడా లేని సమయంలో తన మెడలో ఉన్న పుస్తెలతాడు అమ్మి మరి డబ్బులు ఇచ్చిందని, తనకన్నా కూడా తన భార్య ఎంతో ధైర్యం కలదని చెప్తాడు మన చలపాయి.అంతేకాదు తన భర్తకి వేషాలు సరిగా రావడం లేదని ఓ రోజు సరాసరి అన్న ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి మరి గట్టిగా అడిగేసిందట.
నా భర్తకి ఏం తక్కువ ? హీరో శోభన్ బాబు కన్నా కూడా ఎంతో అందగాడు నా భర్తకి ఎందుకు వేషాలు ఇవ్వరు అంటూ గట్టిగా నిలదీసిందట.

ఓ రోజు చలపతిరావు వేస్తున్న చీకటి తెర అనే నాటకంలో హీరోయిన్ పాత్ర కి ఎవరు దొరకలేదు.అంతకుముందు అనుకున్న హీరోయిన్ సరిగ్గా సమయానికి హ్యాండ్ ఇవ్వడంతో ఇక చేసేదేం లేక చలపతిరావు అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్న తన భార్యని ఆ పాత్రలో హీరోయిన్ గా నటింప చేశాడు.అలా ఆ నాటకంలో హీరోయిన్ గా చలపతిరావు భార్య తొలిసారి నటించింది.
అంతేకాదు ఆ నాటకం అనేకసార్లు ప్రదర్శింపబడింది.ఇందుమతికి బెస్ట్ ఆర్టిస్టుగా అవార్డు కూడా వచ్చిందిఅలా తన జీవితంలో ఎన్నోసార్లు తన భార్యను తన వెనుక ఉండి నడిపిందంటూ చలపతిరావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు 1200 అద్దె ఇంటి నుంచి ఏకంగా 15 రూపాయల ఇంటికి మారినా కూడా ఏనాడూ తన భార్య ప్రశ్నించలేదంటూ ఆమె గొప్పతనాన్ని తెలియజేశాడు.