ట్విట్టర్ లో డార్లింగ్ అభిమానుల ఆగ్రహం.. 'వేక్ అప్ ఆదిపురుష్ టీమ్' అంటూ రచ్చ..

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఈయన సినిమాలు అన్ని కూడా 100 కోట్ల బడ్జెట్ పైమాటే అని చెప్పాలి.

 Om Raut Adipurush Trends On Social Media As Prabhas Fans Details, Prabhas Fans, Prabhas, Adipurush Movie, Om Raut, Kriti Sanon, Saif Ali Khan, Sunny Singh, Aadipurush Updates, Prabhas Adipurush, Pan India Movie, Prabhas Fans-TeluguStop.com

ప్రభాస్ చేతిలో ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఉన్నాయి.ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశ పరిచాడు.

అసలు డార్లింగ్ ఇలాంటి సినిమా ఎలా ఒప్పుకున్నాడు అనే సందేహం ఆయన ఫ్యాన్ కు సైతం కలిగింది.దీంతో ఈయన తర్వాత సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

 Om Raut Adipurush Trends On Social Media As Prabhas Fans Details, Prabhas Fans, Prabhas, Adipurush Movie, Om Raut, Kriti Sanon, Saif Ali Khan, Sunny Singh, Aadipurush Updates, Prabhas Adipurush, Pan India Movie, Prabhas Fans-ట్విట్టర్ లో డార్లింగ్ అభిమానుల ఆగ్రహం.. వేక్ అప్ ఆదిపురుష్ టీమ్#8217; అంటూ రచ్చ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ అప్డేట్ వల్ల అయినా రాధేశ్యామ్ ప్లాప్ నుండి బయటపడాలని ఫ్యాన్స్ చూస్తుంటే ప్రభాస్ డైరెక్టర్లు మాత్రం అవేమీ పట్టించు కోవడం లేదు.అందుకే వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కనీసం షూటింగ్ పూర్తి చేసుకున్న ఆదిపురుష్ టీమ్ అయినా ఏదొక అప్డేట్ ఇవ్వక పోవడంతో ఈ టీమ్ పై డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.దీంతో ఆదిపురుష్ టీమ్ పై కోపాన్ని అంతా ట్విట్టర్ లో చూపిస్తున్నారు.

ట్విట్టర్ లో డార్లింగ్ ఫ్యాన్స్ ”వేక్ అప్ ఆదిపురుష్ టీమ్” అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

ప్రభాస్ నటిస్తున్న మిగతా సినిమాల కంటే ఈ మేకర్స్ చాలా గుప్తంగా ఏ అప్డేట్ ఇవ్వకుండా ఉండడంతో వీరి ఆగ్రహం తారా స్థాయికి చేరుకుంది.దీంతో ట్విట్టర్ లో ”వేక్ అప్ ఆదిపురుష్ టీమ్” అంటే మేకర్స్ ను ఇప్పటికైనా నిద్ర లేచి అప్డేట్ ఇవ్వండి అంటూ ఆ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.మరి టీమ్ ఇప్పటికైనా వీరి మొర ఆలకిస్తుందో లేదో చూడాలి.

ఇక ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేసాడు.రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాజిహ్వ పాత్రలో కనిపించ నున్నాడు.అలాగే ప్రభాస్ కు జోడీగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుంది.లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.

ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube