ఫిదా సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి మిగతా హీరోయిన్లకు భిన్నంగా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు.స్టార్ హీరోల సినిమాల్లో సాయిపల్లవికి ఎక్కువగా ఆఫర్లు రాకపోయినా యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు సాయిపల్లవి.
ఫిదా సినిమాలో వచ్చిండే పాటతో రికార్డులు క్రియేట్ చేసిన సాయిపల్లవి లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాటతో రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నారు.
సినిమాల ద్వారా సాయిపల్లవి ఇప్పటికే సత్తా చాటగా చూడటానికి అచ్చం సాయిపల్లవిలా కనిపించే సాయిపల్లవి చెల్లి పూజా కణ్ణన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.
దాదాపు ఐదు సంవత్సరాల క్రితం కారా అనే లఘుచిత్రంలో నటించిన పూజా కణ్ణన్ ప్రముఖ తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు.తెలుగులోని పలు సినిమాలకు స్టంట్ మాస్టర్ గా పని చేస్తున్న స్టంట్ శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో పూజా కణ్ణన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
అయితే పూజా కణ్ణన్ సినిమా ఎంట్రీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇప్పటివరకు స్టంట్ మాస్టర్ గా పని చేసిన శివ ఈ సినిమాతో దర్శకునిగా మారనున్నారు.క్రాక్ సినిమాతో విలన్ గా మెప్పించిన సముద్రఖని కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు.మరి సాయిపల్లవి చెల్లి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
సాయిపల్లవికి డూప్ లా కనిపించే పూజా కణ్ణన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే అక్క స్థాయిలో సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.పూజా కణ్ణన్ కూడా సాయిపల్లవిలా మంచి డ్యాన్సర్ కావడం గమనార్హం.
ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.