వైరల్ వీడియో: స్టీరింగ్ వదిలేసి... కారు పైకి ఎక్కి పుషప్స్ చేసిన యువకుడు.. చివరకు..?!

ప్రస్తుత రోజులలో యువత సోషల్ మీడియాలో ఫాలోయింగ్  పెంచుకోవడం కోసం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కోసం ఎలాంటి సాహసాలకైనా వెనకాడరు.కొంతమంది బైక్ పై నిలబడి, అలాగే కార్లపై నిలబడి వివిధ రకాల సాహసాలు చేస్తూ చివరికి పోలీసులు చేతిలో బలి అవుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం.

 Viral Video The Young Man Who Left The Steering Wheel And Climbed Into The Car A-TeluguStop.com

అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి చేసిన పనికి నెటిజన్స్ ఆశ్చర్యపోవడంతో పాటు ఉత్తరప్రదేశ్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా ఆ వీడియోను పోస్ట్ చేశారు.ఇంతకీ ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా.? ఒక యువకుడు కారు నడుపుతూ  స్టీరింగ్ వదిలేసి, కారు పైకి ఎక్కి పుషప్స్ చేయడం మొదలుపెట్టాడు.ఇది ఇలా ఉండగా ఈ వీడియోను వీక్షించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు శభాష్ బాగా చేశావ్.బాగా హార్డ్ వర్క్ చేశావ్.సూపర్… ఇదిగో నీకు బహుమానం” అంటూ  ఫైన్ రిసిప్ట్ ఇచ్చారు పాపం.

దీంతో ఆ ఫైన్ రిసిప్ట్ చూడగానే ఆ కుర్రాడికి మైండ్ బ్లాక్ అయ్యి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.ఆ వీడియోకు ఉత్తరప్రదేశ్ పోలీసులు కొన్ని రకాల పుషప్స్ మిమ్మల్ని చట్టం దృష్టిలో తొక్కేస్తాయని.” స్ట్రాంగ్‌గా ఉండండి… సేఫ్‌గా ఉండండి” అంటూ కాప్షన్ ను జత చేశారు.వాస్తవానికి కదిలే వాహనంపై ఇలాంటి స్టంట్స్ చేయడం చట్టరీత్యా నేరమని ఉత్తరప్రదేశ్ పోలీసులు పేర్కొన్నారు.

ఇంతకీ ఆ కారుపై ఎక్కిన కుర్రాడు ఎవరని అనుకుంటున్నారా.? సమాజ్ వాదీ పార్టీ నేత కృష్ణ మురారీ యాదవ్ కొడుకు ఉజ్వల్ యాదవ్‌ అని పోలీసులు గుర్తించారు.ఇక ఈ వీడియో చూసిన పోలీసులు వెంటనే స్టంట్స్ చేసిన వ్యక్తిని, వీడియో షూట్ చేసిన వ్యక్తిని ఇద్దరినీ పిలిపించారు.ఈ వీడియో వైరల్ అవ్వడంతో.ఇంకా చాలా మంది ఇలా చేస్తారేమో అనే డౌట్ వచ్చిన పోలీసులు… వెంటనే  వీడియోని సోషల్ మీడియా ఖాతా  ద్వారా షేర్ చేశారు.ఈ వీడియోను వీక్షించిన కొంతమంది నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటే.

మరికొందరు పోలీసులు ఇలా వార్నింగ్ ఇవ్వడం మంచిదేనని కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube