శర్వానంద్ హీరోగా ప్రియాంక అరూల్ మోహన్ హీరోయిన్ గా కిశోర్ దర్శకత్వంలో రూపొందిన శ్రీకారం సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది.యూత్ కు ఒక మంచి మెసేజ్ ఇవ్వడంతో పాటు ఎంటర్ టైన్ మెంట్ ను కూడా ఇచ్చే విధంగా సినిమా ఉండటం వల్ల మొదటి రోజే సినిమా బాగుందనే టాక్ వచ్చింది.
పెద్ద ఎత్తున వసూళ్లు నమోదు అవుతాయని ఆశిస్తే నిర్మాతలు మరియు బయ్యర్లు నిరాశ పడే విధంగా కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి.మొదటి రోజు జాతి రత్నాలు సినిమాను మించి శ్రీకారం సినిమా వసూళ్లను నమోదు చేసింది.దాదాపుగా రూ.4.25 కోట్ల వసూళ్లను శ్రీకారం మొదటి రోజు రాబట్టింది.ఆ తర్వాత రోజు రూ.1.5 కోట్లను దక్కించుకున్న ఈ సినిమా మూడవ రోజు వీకెండ్ అవ్వడం వల్ల భారీ వసూళ్లను ఆశ పెట్టుకుంది.కాని అనూహ్యంగా శ్రీకారం సినిమాకు మూడవ రోజు అయిన శనివారం నిరాశ కలిగించే వసూళ్లు నమోదు అయ్యాయి.ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మూడవ రోజు రూ.1.15 కోట్ల ను మాత్రమే రాబట్టింది.జాతి రత్నాలు మూడవ రోజు ఏకంగా 4.5 కోట్ల రూపాయలను రాబట్టి దూసుకు పోతుంటే శ్రీకారం మాత్రం నిరుత్సాహ పర్చింది.
శ్రీకారం సినిమా మొత్తంగా 15 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.ఇప్పటి వరకు అంటే మూడు రోజులకు గాను ఈ సినిమా 6.75 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరింత వసూళ్లు కావాల్సి ఉంది.
మొదటి వీకెండ్ పూర్తి అయితే వీక్ డేస్ లో సినిమా ఏ విధంగా రాబట్టగలదు అనే విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అనేది సాధ్యం కాకపోవచ్చు అని సినిమా 11 నుండి 12 కోట్ల వరకు రాబట్టి బ్రేక్ ఈవెన్ ముందు ఆగి పోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
మొత్తాన్నికి శ్రీకారం సినిమా సక్సెస్ టాక్ వచ్చినా పాజిటివ్ టాక్ వచ్చినా కూడా వసూళ్ల విషయంలో మాత్రం నిరాశను కలిగిస్తుంది.