బాబు ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే ?

టీడీపీ అధినేత చంద్రబాబులో ఈ మధ్యకాలంలో కోపం ఎక్కువ అయిపోయింది.పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా ఈ అసహనం కనిపించలేదు.151 సీట్లతో వైసీపీని గెలిపించుకునేందుకు తాము చేసిన తప్పులు ఉన్నాయని, టిడిపి తప్పకుండా గెలుస్తుందనే అతి నమ్మకంతో కొన్ని కొన్ని తప్పులు కప్పిపుచ్చినట్టుగా వ్యవహిరించారు.ఇదే వైసీపీకి టీడీపీకి ఘోర పరాజయాన్ని మిగిల్చింది అనే విషయం చంద్రబాబుకు తెలియంది కాదు.

 Discution About Tdp Leaders Behaviour, Tdp, Telugudesam Party, Ysrcp, Ap, Janase-TeluguStop.com

అయినా అప్పుడు లైట్ తీసుకున్న బాబు ఇప్పుడు మాత్రం టిడిపి ఓటమి విషయాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రజలతో ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.ప్రజలు డబ్బుకు అమ్ముడు పోయారని, అసలు జనాల్లో పౌరుషం లేదని, అందుకే వైసీపీని గెలిపించారని, ఇప్పటికీ ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తున్న, ప్రజలు ఎందుకు మద్దతుగా నిలవడం లేదని, తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజలపై తమ ఆక్రోశాన్ని చూపిస్తూ, ప్రజలపై విరుచుకుపడుతున్నారు.అయితే బాబు అసహనంపై ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళ మధ్య చర్చ జరుగుతోంది.

ఈ స్థాయిలో ప్రజలపై ఆగ్రహం చూపిస్తే ప్రజలలో టీడీపీ పై ఉన్న కాస్త సానుభూతి కూడా దూరమవుతుందని, ప్రజలలో అనవసరమైన వ్యతిరేక సంకేతాలు వెళ్లి పోతే మొదటికే మోసం వస్తుందని అభిప్రాయపడుతున్నారు.అంతేకాదు ఏపీ సీఎం జగన్ ప్రజాసంక్షేమ పథకాలపైనే పూర్తిగా దృష్టి పెట్టి, ప్రజల్లో తమ పట్టు సడలకుండా అన్ని రకాలుగా చూసుకుంటున్న, నిత్యం ఏదో ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెడుతూ ,ప్రజలలో తమ పట్టు సడలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే ఈ పథకాలు లోని లోపాలు పై హుందాగా విమర్శలు చేస్తూ స్పందిస్తూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే టిడిపి కి క్రమక్రమంగా ఆదరణ పెరుగుతూ వస్తుంది.

అయితే ఇప్పుడు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుతో చాలామంది తెలుగు దేశం పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, చాలామంది నాయకులు ఆయనను లెక్క చేయనట్టుగానే వ్యవహరిస్తూ, వస్తున్నారు.

పార్టీలో గతంలో ఉన్న క్రమశిక్షణ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయినట్లు గా కనిపిస్తోంది.నాయకులను చూసి భయపడే పరిస్థితి ఏర్పడింది.ఇక కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని బాబు వంటి నాయకుడు సైతం రోడ్డు మీదకు వచ్చి ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.గతంలో చంద్రబాబు నియోజకవర్గంలో అడుగుపెట్టకుండానే ఆయన సొంతంగా గెలిచిన పరిస్థితి ఉన్న కుప్పం నియోజకవర్గంలోనూ పరిస్థితి చేయి దాటిపోయింది.

వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా, తాము అమరావతి తో పాటు జగన్ ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నామని దానికి ప్రజలు మద్దతు ఎందుకు ఇవ్వరు .? ఇచ్చి తీరాల్సిందే అన్నట్టుగా మొండి పట్టుదలకు వెళ్లడం మొదటికే మోసం వచ్చే పరిస్థితి తీసుకొచ్చేలా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube