శోభన్ బాబు డ్రైవర్ కూడా ఎంతో రిచ్ ..మరి అంత డబ్బు ఎలా వచ్చింది ..!

తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది హీరోలు వెండి తెరపై ఒక వెలుగు వెలిగారు అలాంటివారిలో శోభన్ బాబు ఒకరు అప్పట్లో ఈయనకి లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు.శోభన్ బాబు గారు సినిమాలు తీస్తే వచ్చే డబ్బుతో ఎక్కువగా భూములు కొనేవారు అని శోభన్ బాబుకి బాగా దగ్గర ఫ్రెండ్ అయినా మురళి మోహన్ చెప్పాడు.

 Sobhan Babu Driver Also Very Rich Reason Why,shoban Babu .tollywood .driver ,sha-TeluguStop.com

శోభన్ బాబు తెలుగులో తీసిన సినిమాల్లో దేవత, జీవన తరంగాలు గోరింటాకు లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి.అయితే ప్రస్తుతం శోభన్ బాబు ఆస్తుల విలువ ఎంత అంటే 80 వేల కోట్లు అని చెబుతున్నారు.

ఎందుకంటే అప్పట్లో ఆయన చేసిన ప్రతి సినిమాకి వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని భూములపై కేటాయించి ఎక్కువగా భూములు కొన్నారు.

Telugu Shanthi Kumari, Sobanbabu, Sobhan Babu, Tollywood-Telugu Stop Exclusive T

శోభన్ బాబు చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ లో మనుషులు పెరుగుతారు కానీ భూములు పెరగవు కాబట్టి ఫ్యూచర్లో భూములకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అందుకని నేను భూములు ఎక్కువగా కొంటున్నాను అని మురళి మోహన్ లాంటి వారితో చెప్పారట వీలైతే మురళీమోహన్ నీ కూడా భూములు తీసుకోమని చెప్పారు అని మురళి మోహన్ గారు చెప్పుకొచ్చారు.అయితే శోభన్ బాబుకి సినిమాలలో క్రేజ్తగ్గిపోవడంతో నాన్నగా, తాతగా క్యారెక్టర్లు చేయడానికి ఇష్టపడలేదు.దాంతో ఆయన సినిమాలో హీరోగా చేయడం మానేసిన తర్వాత పెద్దగా సినిమాల్లో చేయలేదు ఇండస్ట్రీ మొత్తం లో యాక్టర్ గా రిటైర్మెంట్ తీసుకున్న నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది శోభన్ బాబు మాత్రమే.

ఆయన సినిమాల్లో ఒక అగ్ర హీరోగా వెలుగొందారు అలాంటి హీరో మిగతా అగ్రహీరోల ఫ్యామిలీ నుంచి వారసులు వస్తున్నప్పటికీ ఆయన ఫ్యామిలీ నుంచి వారసుడు రావడానికి ఇష్టపడలేదు.ఎందుకంటే సినిమాల్లో సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చు అందుకే బిజినెస్ ల మీద వాళ్ల కొడుకుల దృష్టి ఉండేలా చూసుకున్నాడు.

అయితే అప్పట్లో ఉన్న జనాలు మాత్రం శోభన్ బాబు పిల్లికి బిచ్చం పెట్టడు అంత పిసినారి అంటారు కానీ శోభన్ బాబు తన డ్రైవర్ గా ఉండి రోజు తన కాళ్లు నొక్కే వ్యక్తికి డబ్బులు సహాయం బాగా చేశారు అని చాలామంది చెప్తారు.శోభన్ బాబు మాత్రమే కాదు ఆయన దగ్గర పనిచేసిన డ్రైవర్ కూడా కోటీశ్వరుడే అని చెప్తుంటారు.

అయితే శోభన్ బాబు బయటి వ్యక్తులకు పెద్దగా సహాయం చేయక పోయినప్పటికీ తన చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం ఎప్పుడూ ఏదో ఒక సహాయం చేస్తూ ఉండేవాడు అని శోభన్ బాబు గురించి తెలిసినవారు అంటారు.ఎందుకంటే సంతోషం అనేది మనం ఒకరం బాగుంటేనే రాదు మన చుట్టూ ఉన్నవారు కూడా బాగుంటే అప్పుడే మనం సంతోషంగా ఉంటాం అని ఎప్పుడు చెబుతుంటారు అని శోభన్ బాబు సన్నిహితులు అంటున్నారు.

Telugu Shanthi Kumari, Sobanbabu, Sobhan Babu, Tollywood-Telugu Stop Exclusive T

ఏది ఏమైనా అప్పుడెప్పుడో సంపాదించిన శోభన్ బాబు సంపాదన ఇప్పుడు 80 వేల కోట్లు అవ్వడం అంటే మామూలు విషయం కాదు హీరోలలో ఇండియాలో ఏ హీరో సంపాదించనంత డబ్బులు శోభన్ బాబు గారు సంపాదించారని చెప్పొచ్చు.అయితే అప్పట్లో శోభన్ బాబు గారికి విద్య నేర్పిన గురువుగారు అయిన ఒక పెద్దాయన కూతుర్ని పెళ్లి చేసుకున్నారు ఎందుకు అంటే మంచి మాటలు చెప్పే మా గురువు లాంటి మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు అని ఆయన మీద కృతజ్ఞతా భావంతో వాళ్ల కూతురు శాంతి కుమారి గారిని పెళ్లి చేసుకున్నాడు ఆమె చూడటానికి అంత అందంగా లేకపోయిన పెళ్లి చేసుకున్నారు.శోభన్ బాబుని అప్పుడు అందరూ గొప్ప మనసున్న మనిషి అని కూడా పిలిచారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube