ఒడిశాలో ఘోరం జరిగింది.100 రూపాయలు ఇవ్వడానికి నిరాకరించాడని యూనివర్సిటీ మాజీ వీసీని హత్య చేసి పారిపోయాడు ఓ దుండగుడు.ఒడిశా సంబల్ పూర్ వర్సిటీ మాజీ వీసీ ద్రుబరాజ్ నాయక్ అక్కడ ఝార్సుగూడ జిల్లాలో సర్గిగూడ లో ఉంటున్నారు.ఆయన నివాసంలో చొరబడిన ఓ దుండగుడు నగదు ఇవ్వమని అడిగాడు.
అయితే మాజీ వీసీ డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోలేదు.డబ్బు ఇవ్వనందుకు కోప్పడ్న ఆ వ్యక్తి గొడ్డలితో మాజీ వీసీ మీద డాడి చేశాడు.
తీవ్ర గాయాలపాలైన ఆయన కొద్దిసేపటికే మృతి చెందారు.ఆ దుండగుడు అక్కడ నుండి పరారయ్యాడు.
స్థానికుల ఇన్ ఫర్మేషన్ అందుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసులో నిందితుడిగా 20 ఏళ్ల ప్రబెణ్ ధరువాని అరెస్ట్ చేశారు.దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో అతను పరారీ అవుతుండగా పోలీసులు పట్టుకున్నారు.మరణించిన మాజీ వీసీ ధ్రుబరాజ్ నాయక్ పర్యావరణ వేత్తగా కూడా అక్కడ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నట్టు సమాచారం.
అక్కడ ఆయన నివాసం ఉన్న గ్రామంలో మొక్కలు నాటి అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని తెలుస్తుంది.ఓ చెరువు విషయంలో వివాదం కూడా ఆయన హత్యకు కారణమై ఉండొచ్చని చెబుతున్నారు.
కేసు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ బికాస్ చంద్ర దాస్ వెల్లడించారు.