కంది పంటను అశించు చీడపీడలు.. నివారణ కోసం సూచనలు..!

కంది పప్పు( Kandi dal ) ఆహార పంటలలో ప్రధానమైనది కాబట్టి మార్కెట్లో ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.ఎక్కువగా కంది పంటను పెసర, మినుము లాంటి పైర్ల తో మిశ్రమ పంటగా సాగు చేస్తారు.

 Pests That Attack The Curry Crop Suggestions For Prevention , Agriculture, Crop-TeluguStop.com

కంది పంట వేశాక పూత వస్తున్న సమయంలో, కాయలు ఏర్పడుతున్న దశలో వివిధ రకాల పురుగులు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.వాతావరణం లో మార్పులు జరిగినప్పుడు, వర్షం లేదా చిరుజల్లులు కురిసినప్పుడు కాయ తొలిచే పురుగులు పంటను ఆశిస్తాయి.

కాబట్టి కంది పంటకు పూత వచ్చు దశలో సంరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడి పొందవచ్చు.తెల్లని రెక్కలు ఉండే పురుగులు లేత ఆకులను, పిందెలను, కాయలను తొలచి తింటాయి.

వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు కచ్చితంగా ఇవి పంటని ఆశిస్తూ వీటి ఉధృతి తీవ్రంగా పెరుగుతుంది.కాబట్టి పూత వచ్చిన తొలిదశలోనే క్లోరిపైరిపాస్( Chlorpyrifos ) 2.5మి.లీ, ప్రోఫెనోపాస్( Profenopause ) 2.0మి.లీ ను లీటర్ నీటిలో కలిపి పూత, లేత కొమ్మలు బాగా తడిచేలా పిచ్చికారి చేయాలి.

Telugu Agriculture, Chlorpyrifos, Crop, Latest Telugu, Monocrotopus-Latest News

పూతపై, మొగ్గలపై, లేత ఆకులపై గుడ్లు పెట్టి పంటను ఆశించే పురుగులను శనగపచ్చ పురుగులుగా చెప్పుకోవచ్చు.ఇవి కాయలోనికి చొచ్చుకు వెళ్లి గింజలను అమాంతం తినేస్తాయి.ఆశించిన తొలి దశలోనే వీటిని అరికట్టాలి.ఎసిఫెట్ 1.5గ్రా, మోనొక్రోటోపాస్ ( Monocrotopus )1.6మి.లీ ను లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.కంది పంట వేయకముందు వేసవికాలంలో లోతుగా దుక్కి దున్ని పొలాన్ని చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయాలి.

పురుగులను ఆకర్షించే పూల మొక్కలను పొలం గట్లపై చుట్టూ వేసుకోవాలి.పొలంలో వర్షాధార నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.ఎప్పుడూ ఒకే పంట కాకుండా పంట మార్పిడి చేయాలి.పురుగుల నివారణకు పొలంలో లైట్ ట్రాఫ్ అమర్చుకోవాలి.

పొలంలో అక్కడక్కడ లింగాకర్షక బుట్టలు అమర్చాలి.పొలంలో మిత్ర పురుగుల సంఖ్య పెంపొందించుకోవాలి.

పంట పూత దశలో, కాయ దశలో ఉన్నప్పుడు సరైన సస్యరక్షణ పద్ధతులు పాటించి పంటను కాపాడుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube