రాజకీయం రాజకీయమే , కుటుంబ బంధాలు కుటుంబ బంధాలే.రెండు ఒకే గాటిన కట్టడం కుదరదు.
ఇవి రెండు వేరు వేరు.ఈ రెండు దారులు కలిస్తే ఆ కుటుంబంలో విబేధాలు తప్పవు.
ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువు అయ్యింది.ఇప్పుడు చంద్రబాబు, బాలయ్య కుటుంబాల్లో ఇటువంటి రాజకీయమే నడిచి మనస్పర్థలు వరకు వెళ్ళింది.
వివరాలు పరిశీలిస్తే మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో విశాఖ టీడీపీ ఎంపీగా పోటీ చేసిన బాలయ్య చిన్నల్లుడు లోకేష్ తోడల్లుడు అయిన శ్రీ భరత్ పోటీ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆయనకు ఆ సీటు దక్కడం వెనుక పెద్ద తతంగమే జరిగినట్టు ఇప్పుడు ఒక్కో వార్త బయటకి వస్తోంది.
శ్రీ భరత్ తాత ఎంవివిఎస్ మూర్తి ఇటీవలే అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.ఆయన గీతం విద్యాసంస్థల అధినేత.ఆయన గతంలో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.చనిపోకముందు ఎమ్మెల్సీగా ఉన్నారు.
తాత స్థానంలో ఎంపీగా విశాఖ నుంచి పోటీ చేయాలని శ్రీభరత్ బాలకృష్ణ , భార్య ముందు పెట్టాడట.ఆ విషయం చెప్పగానే రాజకీయాల్లోకి వద్దంటే వద్దు అంటూ బాలయ్య ఫ్యామిలీ గట్టిగానే చెప్పారట.
కానీ భరత్ వినకుండా తన తండ్రితో పాటు మరో తాత కావూరి సాంబశివరావుతో ఈ విషయం చెప్పాడట.

వారు బాబు కి ఈ విషయాన్ని గట్టిగానే చెప్పినా బాబు పెద్దగా పట్టించుకోకపోవడంతో మీడిలోనే అన్ని విషయాలు మాట్లాడతామని హెచ్చరించారట.అయినా బాబు మెత్తబడకపోవడంతో తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు చెప్పి సంచలనం రేపాడు.దీంతో అప్పటివరకు అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఘంటాను రంగంలోకి దించాలని చుసిన బాబు వెనక్కి తగ్గి శ్రీ భరత్ కి అవకాశం కల్పించాడట.
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలయ్యిందట భరత్‌ను ఓడించేందుకు లక్ష్మీనారాయణను జనసేన నుంచి రంగంలోకి బాబు దింపాడనే వార్తలు మొదలయ్యాయి.శ్రీ భరత్‌కు టికెట్ ఇప్పించి కూడా ఓడించబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పుడు కూడా నందమూరి, నారా కుటుంబాల్లో భరత్ విషయమై వివాదాలు మొదలయినట్టు సమాచారం.ఇంకా ఈ వివిధం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.